జగన్ పార్టీలో ముదిరిన వివాదం.

Published: Friday July 19, 2019
à°† నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్ మధ్య ముదిరిన వివాదం ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్లింది. అక్కడ జరిగిన పంచాయితీలో.. వారిద్దరూ సీఎం చెప్పిన దానికి తలాడించి సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు. మళ్లీ పాత కథనే నడిపిస్తున్నారు. వారిద్దరి వైఖరిపై నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ శ్రేణులు కలత చెందుతున్నాయి. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? అక్కడి వైసీపీ ఇన్‌ఛార్జ్‌à°•à°¿, ఎమ్మెల్యేకి మధ్య వివాదం ఏంటి? పూర్తి వివరాలు à°ˆ కథనంలో తెలుసుకోండి.
 
 "ఎవరికి వారే యమునా తీరే" అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు. నిజానికి వీరిద్దరు నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల ముందువరకూ చిరకాల శత్రువులు ఉన్నవారు సైతం ఏకమై.. ఫ్యాన్ పార్టీకి ప్రత్యర్థులుగా పోటీలో నిలిచినప్పటికీ వీరిద్దరూ ఏమాత్రం వెరవలేదు. సమరానికే సై అన్నారు. ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు కలసి పనిచేసి నందికొట్కూరు కోటలో మరోసారి పార్టీ జెండా పాతారు. స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుని.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌à°—à°¾ ఇచ్చారు. ఇక నియోజకవర్గంలో తమకు తిరుగులేదని వీరిద్దరూ చాటిచెప్పిన తరుణంలో.. ఏంజరిగిందో ఏమోగానీ, à°ˆ ఇద్దరి నేతల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. à°ˆ వివాదం మరింతగా ముదిరి నందికొట్కూరు వైసీపీలోనే వర్గపోరుకి దారితీస్తోందట.
 
 
    నందికొట్కూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి రెండు కళ్లుగా ఉండాల్సిన ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటుండటంతో.. ఫ్యాన్ పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఎన్నికల్లో ఏకతాటిపై పనిచేసిన తాము.. ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్ధర్ వైపు వెళ్లాలా? లేక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పక్కన చేరాలా? అని మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు. దీంతో సామాజికవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలు విడిపోతోందట. వైసీపీ క్యాడర్ రెండుగా చీలుతోందనీ, à°ˆ పరిణామంతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదనీ కొందరు వైసీపీ నాయకులే ఆవేదన చెందుతున్నారు. ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇంతకు ముందులా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనీ, ఇకపై వీరు ఎడమొహం పెడమోహంగా ఉంటే రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందనీ కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారట.