ప్రపంచబ్యాంకు రుణం వస్తుందని పలు ప్రాజెక్టులకు సొంత నిధులు

Published: Sunday July 21, 2019
అసలే దాదాపు రెండు నెలలుగా పలు ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజధాని అమరావతిని.. ప్రపంచ బ్యాంకు తాజా నిర్ణయం దిమ్మెరబోయేలా చేసింది! రాజధాని నిర్మాణానికి ఇద్దామని భావించిన రుణాన్ని ఇవ్వబోవడం లేదని ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. à°ˆ నిర్ణయం ప్రభావంతో అమరావతిలోని వివిధ ప్రాజెక్టులకు రుణమివ్వాలని ఇప్పటి వరకూ భావించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా వెనుకంజ వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిజానికి, అమరావతి కోసం రుణాన్ని మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా కొన్ని నెలల క్రితమే ప్రపంచ బ్యాంక్‌ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. à°ˆ బ్యాంకు రుణంపై నమ్మకం పెట్టుకొని రాజధానిలోని పలు ప్రాజెక్టులపై ఇప్పటికే వందలాది కోట్లను ఏపీసీఆర్డీయే వెచ్చించింది. ఇప్పుడు à°† సంస్థ ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచబ్యాంక్‌ అందజేసే రుణంపై అది వసూలు చేసే వడ్డీ ఇతర ద్రవ్యసంస్థల వడ్డీలతో పోల్చితే బాగా తక్కువ.
 
 
à°ˆ కారణంగా అది ఇచ్చే మొత్తంతో ఇతర అప్పులను తీర్చివేసి, వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సీఆర్డీయే భావించింది. ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వకపోవడం à°’à°• ఎత్తు అయితే, జాతీయ, అంతర్జాతీ సంస్థలూ అదే బాటలో నడిచే వాతావరణం కనిపిస్తుండటం సీఆర్డీయేను మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే ఏఐఐబీ (ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌) à°ˆ మేరకు సంకేతాలివ్వగా, మరికొన్ని కూడా అదేబాట పట్టనున్నాయని భావిస్తున్నారు. నిజానికి, రాజధానిని నిర్మించేందుకు అవసరమైన వేలాది కోట్ల రూపాయలను వివిధ దేశీయ, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, బ్యాంకుల నుంచి రుణరూపేణా సేకరించేందుకు à°—à°¤ ప్రభుత్వ హయాం లో సీఆర్డీయే విస్తృత ప్రయత్నాలు చేసింది. à°† ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న దశలో, ప్రపంచబ్యాంకు ఝల క్‌ ఇచ్చింది.
 
అమరావతిలో భూములకు ప్రస్తుతం డిమాండ్‌ దారుణంగా పడిపోయింది. దానివల్ల రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల ద్వారా భారీఎత్తున నిధులను సమీకరించి, అమరావతి నిర్మాణానికి వెచ్చించాలన్న సీఆర్డీయే ప్రయత్నాలూ ఫలించే అవకాశం కనిపించడం లేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపకపోవడమే à°ˆ పరిస్థితికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.