కమలంలో చేరికలకు జగన్‌ వ్యాఖ్యలతో బ్రేక్‌

Published: Sunday July 21, 2019
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ అన్ని మార్గాలను సిద్ధం చేసుకుంటోంది. à°† మధ్య టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో చేర్చుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిని తమవైపు తిప్పుకోవాలని భావించింది. కానీ, సీఎం జగన్‌ బీజేపీ యత్నాలకు బ్రేక్‌లు వేశారు. ఎవరు పార్టీ మారి నా పదవికి రాజీనామా చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. దాంతో ప్రజాప్రతినిధులు పార్టీలోకి రావడం లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే అధికార పార్టీపైనే కమలదళం గురిపెట్టింది. వైసీపీ సర్కార్‌ చర్యలు తీవ్రంగా విమర్శిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్‌ తదితరులు పదునైన పదజాలమే ఉపయోగిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత తొందరపాటు చర్యగా అభివర్ణించిన కన్నా.. తాజాగా తిరుపతిలో మాట్లాడుతూ ‘టీడీపీ అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్‌కు అధికారం అప్పగిస్తే వైసీపీ పాలన కూడా అదే రీతిలో సాగుతోంది.
 
రాష్ట్రంలో ప్రతిచోటా పోలీస్‌ రాజ్యం నడుస్తోంది. గ్రామ, మండలస్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలు, నేతలపై రౌడీషీట్లు తెరుస్తున్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కొంటూ.. బాధితులు ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఇక పురందేశ్వరి వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్‌లో జగన్‌కు చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ‘ప్రశాంతమైన విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలివ్వడం, à°’à°• మతాన్నో, కులాన్నో కావాలని రెచ్చగొట్టేలా పోలీసులు ఉత్తర్వులివ్వడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తాజాగా ఎమ్మెల్సీ మాధవ్‌ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ.. శాసనమండలిలో విశాఖ చర్చిలకు భద్రత అంశాన్ని ప్రస్తావించారు. ‘ప్రశాంతమైన విశాఖలో చిచ్చురేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఎవరి మెప్పుకోసం à°ˆ పని చేస్తున్నారు’ అని నిలదీశారు. ఏబీవీపీ విద్యార్థులకు ముసుగులు వేసి క్రిమినల్స్‌లా మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌నాయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తప్పుపట్టారు. దీనికితోడు రాష్ట్రంలో పర్యటిస్తున్న జాతీయ నాయకులు కూడా ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెబుతున్నారు.