అమ్మవారి సేవలో కొత్త గవర్నర్‌

Published: Wednesday July 24, 2019

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వచ్చిన  à°—వర్నర్‌ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ అని ల్‌కుమార్‌ తిరుపతి జేఈఓ పి.బసంత్‌కుమార్, సీవీ ఎస్‌à°“ గోపీనాథ్‌జెట్టి, తిరుపతి ఆరీఓ కనకనరసారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, రూరల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్, ఆలయ అర్చక బృందం స్వాగతం పలికారు. తొలుత ఆలయంలో ధ్వజ స్తం భానికి మొక్కుకొని, కుంకుమార్చన సేవలో à°—à°µ ర్న ర్‌ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదానలను అందజేశారు. 


శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ శ్రీవారి, అమ్మవారి ఆశీస్సులతో తనకు à°ˆ పదవి లభిం చిందని, బాధ్యతతో విధులు నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని  à°…మ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్,  à°ªà°²à±à°µà±à°°à± డీఎస్పీలు, సీఐలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.