యడ్యూరప్ప ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు

Published: Friday July 26, 2019
కర్నాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలాతో కాబోయే ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన గవర్నర్‌తో చర్చించారు. శుక్రవారం సాయంత్రం 6గంటలకు కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్‌à°¡à±€ కుమారస్వామి, సిద్ధరామయ్య తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా యడ్యూరప్ప కోరారు.
 
ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ వారం సమయం ఇచ్చినట్లు తెలిసింది. యడ్యూరప్ప వచ్చే సోమవారం తన ప్రభుత్వ మెజార్టీని విధాన సభలో నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే.. శుక్రవారం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో నేడు చర్చించనున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.