కడుపులో కిలోన్నర ఆభరణాలు

Published: Friday July 26, 2019

కిలోన్నరకు పైగా ఆభరణాలు.. 90 నాణేలు.. కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవిదిద్దులు.. à°ˆ జాబితా చూస్తే ఇవి ఏ లాకర్‌ నుంచో బయటపడ్డాయని అనుకోవచ్చు. కానీ బెంగాల్‌లో à°“ మహిళ(26) ఏకంగా తన పొట్టనే లాకర్‌à°—à°¾ మార్చేసింది! ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్‌బ్యాండ్‌లు, వాచీలను కూడా మింగేసింది. బీర్భుమ్‌ జిల్లాలో à°ˆ వింత చోటుచేసుకుంది. ఆమెకు మతిస్థిమితం లేదని తల్లి చెబుతోంది. ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయని కానీ ఇలా తన బిడ్డ వాటిని మింగేస్తోందన్న విషయం తెలియదని వాపోయింది. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం కలగడంతో రాంపుర్హట్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆమెను తరలించారు. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆభరణాలను బయటకు తీశారు. వాటిలో ఎక్కువగా రాగి, ఇత్తడితో చేసినవే ఉన్నాయని సర్జరీ విభాగాధిపతి సిద్ధార్థ విశ్వాస్‌ చెప్పారు.