13 ఏళ్లుగా మోడుగానే సర్కారు గూడు

Published: Saturday July 27, 2019
రెండు గదులు కట్టి, స్లాబు పోసి, బయట ఇందిరమ్మ ఫొటో తగిలిస్తే, అది ఇందిరమ్మ ఇల్లు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇలాంటి ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టారు. అందులోభాగంగా కర్నూలు నగర శివార్లలోని జగన్నాథగట్టుపై 8,431 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇది జరిగి ఇప్పటికి 13 ఏళ్లు. à°ˆ నిర్మాణాలన్నీ పూర్తయి, జనం చేరితే, à°ˆ గట్టు ప్రాంతం ఇప్పటికి తీర్థంలా ఉండేది. కానీ, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు, పాడుబడిన గోడలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలతో... మోడుబడిన పేదల ఆశలకు ఇక్కడి గృహాలు అద్దం పడుతున్నాయి. ఇన్నేళ్లలో పూర్తి నివాసయోగ్యంగా 200 ఇళ్లు మాత్రమే సిద్ధం చేశారు. నాటి ప్రభుత్వం పేదల నివాసం గురించి మంచి ఆలోచనే చేసినా, అందులో వసతుల గురించి విస్మరించడంతో, పూర్తయిన ఇళ్లలోకి సైతం సాహసించి లబ్ధిదారులు అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. ఎవరూ ఉండకపోతుండటంతో రూ.రెండుకోట్లు విలువైన నిర్మాణ పరికరాలు, సామగ్రి దొంగలపాలయింది.
 
పేదల సొంతింటి కలను తీర్చడానికి పెట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు. పేదలకు ప్రభుత్వమే ఇంటి స్థలం కేటాయించడంతోపాటు, ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చులో కొంత భరించే పథకం ఇది. పథకం ప్రారంభంలో, అంటే 2006లో ప్రతి లబ్ధిదారుకు రూ.47 వేలు సాయం అందేది. à°† తరువాత à°† మొత్తం రూ.75 వేలుకు పెంచారు. 2009 నాటికి à°† సాయం లక్షకు చేరింది. వైఎస్‌ఆర్‌ పాలనలో భారీఎత్తున అమలైన à°ˆ పథకంలో భాగంగా కర్నూలు సిటీ శివార్లలోని జగన్నాథగట్టుపై 8,431 మంది పేదలకు ఉచితంగా స్థలాలు కేటాయించారు. ఇది మొత్తం 160 ఎకరాల స్థలం. జన సంచారం లేని ఈప్రాంతంలో పెద్దఎత్తున గృహా నిర్మాణాలు చేపట్టి, కాలనీగా అభివృద్ధి చేయాలని యోచించారు. దీనికోసం రూ.71 కోట్లు కేటాయించారు. కాలనీగా à°’à°• ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి, పక్కా రోడ్డు వేయాలి, మంచినీటి వసతి ఉండాలి, వీధి దీపాలు వెలగాలి. ఇంత పక్కాగా మౌలిక సదుపాయాలు ఉంటేనే, జనావాసానికి అనువుగా మారుతుంది కానీ, ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం కనీసం పది శాతం నిధులూ ఖర్చు చేయలేదు. మొదట్లో రూ. 7 కోట్లతో కొన్ని చిన్న చిన్న వసతులను అధికారులు కల్పించారు. మరికొన్ని నిధులు అందితే, à°ˆ గట్టు కాలనీ రూపం సంతరించుకొనేదే.