వరదనీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్.

Published: Saturday July 27, 2019

 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°°à°²à±‹ ముంబై - కొల్హాపూర్ మధ్య నడిచే ‘మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్’ వాంగ్నీ ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుంది. సుమారు 2000 మంది ప్రయాణీకులు ట్రెయిన్‌లో ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. 2 అడుగులు మేర వరద నీరు రైల్వే ట్రాక్‌పై నిలిచిపోవడంతో.. ట్రెయిన ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున నుంచి ప్రయాణీకులు ట్రెయిన్‌లో ఆపసోపాలు పడుతున్నారు. సుమారు ఐదు గంటలుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీటిలో కొట్టుకువచ్చే పాములు, విషకీటకాలు ఎక్కడ బోగీల్లోకి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రయాణీకుల్లో చిన్నారులు ఉండటంతో పరిస్థితి భయానకంగా మారింది. అటు రైల్వే పోలీసులు.. ఇటు సిటీ పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ రంగంలోకి దిగారు. ఇప్పటికే నాలుగు బోట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయాన్ని కూడా తీసుకునే ఆలోచనల్లో రైల్వే అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేగాక స్థానిక సేవా సంస్థల సహాయాన్ని రైల్వే అధికారులు కోరుతున్నారు. ప్రయాణీకులు ఆందోళన చెందొద్దని.. రైల్ సేఫ్ ప్లేస్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే à°ˆ మార్గంలో ప్రయాణించే రైళ్లను అధికారులు దారి మళ్లించారు. కల్యాణ్, ఇగత్పురి, మన్మడ్, దౌండ్‌à°² మీదుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.