వర్షాలతో ఊపందుకున్నఖరీఫ్‌ సాగు

Published: Thursday August 01, 2019
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు పుంజుకుంది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయి. కోస్తాలో వాన లోటు గణనీయంగా తగ్గినా, రాయలసీమలో మాత్రం లోటు కొనసాగుతోంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో పత్తి సాగు పుంజుకుంది. ఆరేడు జిల్లాల్లో 6.40లక్షల హెక్టార్లకు గాను ఇప్పటికే 3.58లక్షల హెక్టార్ల(56శాతం)లో సాగులోకి వచ్చింది. à°—à°¤ ప్రభుత్వం జూన్‌లోనే గోదావరి డెల్టాతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు నీరివ్వడంతో నిరుడు à°ˆ పాటికే సగానికిపైగా వరినాట్లు పూర్తయ్యాయి.
 
 
కానీ ఈ ఏడాది పట్టిసీమ ద్వారా మొదట నీరు విడుదలచేసి, తర్వాత కొన్ని రోజులు నిలుపుదల చేయడం, మళ్లీ విడుదల చేసినా, చివరి వరకు చేరకపోవడంతో కృష్ణాడెల్టాలో నాట్లు 20శాతానికి మించలేదు. గోదావరి వరద నీటి విడుదలతో ఉభయగోదావరి జిల్లాల్లో 58శాతం వరినాట్లు పడ్డాయి. వంశధార, నాగావళి ప్రాజెక్టుల కింద వరి నాట్లు 50శాతానికి చేరాయి. నెల్లూరు జిల్లాలో బోర్ల కింద వరి సేద్యం ప్రారంభమైంది. మొత్తంగా 15.19లక్షల హెక్టార్లలో వేసే సార్వా వరి ఇప్పటికి 4.81లక్షల హెక్టార్లకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా అపరాల పంటలు 90వేల హెక్టార్లు, చిరుధాన్యాలు 88వేల హెక్టార్లలోనే సాగులోకి వచ్చాయి. 7.53లక్షల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ ఇంకా 2.5లక్షల హెక్టార్లకే పరిమితమైంది.
 
 
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ సాగు 38.30లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉంది. సీజన్‌ సగం ముగుస్తున్నా 13.84లక్షల హెక్టార్లలోనే వివిధ పంటలు వేశారు. ఆగస్టు 15లోగా వర్షపాతం భారీగా లోటుంటే ప్రత్యామ్నాయ పంటలకు రాయితీ విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కోస్తాంధ్రలో వర్షపాతం కొంత ఆశాజనకంగా ఉన్నా, రాయలసీమలో మూడింట à°’à°• వంతు లోటు కనిపిస్తోంది. వేరుశనగ, పత్తి, అపరాల సాగుకు మరో పక్షం సమయం ఉన్నా, లోటు తీరేంత వాన కురవకపోతే, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, వర్షాభావ ప్రాంతాల రైతులు స్వల్పకాలిక పంటలు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.