ఫొటో తీసి నాకు పంపితే బహుమతి

Published: Sunday August 04, 2019
 ‘ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావి తరాలను కాపాడదాం’ అంటూ ఏపీ వ్యాప్తంగా అధికారులు, నేతలు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆదివారం నాడు విజయవాడలో కృష్ణలంక గీతా నగర్‌లో కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలో మన విజయవాడ కార్యక్రమం జరిగింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యల్వీ.సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎల్వీ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావి తరాలను కాపాడదాం’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. à°ˆ సందర్భంగా స్థానిక ప్రజలకు జ్యూట్ బ్యాగులను అధికారులు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఎల్వీ సుబ్రమణ్యం మొక్కలు నాటారు. à°ˆ మొక్కలను సంరక్షిస్తూ వృక్షాలుగా మార్చే బాధ్యతను స్థానిక మహిళలకు ఆయన అప్పగించారు.
 
"ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలులో ప్లాస్టిక్ గ్లాసులు, బాటిల్ వాడుతుంటే ఫొటో తీసి నాకు పంపితే వంద రూపాయలు బహుమతి ఇస్తాను. మేము కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం పేపర్ గ్లాస్‌లు మాత్రమే ఉపయోగిస్తున్నాం. ప్లాస్టిక్ వద్దు.. జ్యూట్ బ్యాగులు ముద్దు అంటూ పిల్లలు ఇచ్చిన సందేశాన్ని తల్లిదండ్రులు ఆచరించాలి. à°®à°¨à°¦à°¿ అనుకుంటే అందరికీ ఎంతో జాగ్రత్త ఉంటుంది. అందుకే మన ఊరు.. మన విజయవాడ అనే నినాదాన్ని అందరూ పాటించాలి. మనకు తెలియకుండానే చాలా విషయాల్లో మనం జాగ్రత్త అనుకుంటూనే.. అజాగ్రత్తగా ఉంటున్నాం. దీని వల్ల మన పిల్లలకు, మన పెద్దలకు మనమే.. తెలియని హాని చేస్తున్నాం. ప్లాస్టిక్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల నేడు ఎన్నో రకాల రోగాలు కూడా వస్తున్నాయి. బాగా à°¡à±€-గ్రేడ్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం వల్ల మన ఆరోగ్యానికి మనమే చేటు తెచ్చుకుంటున్నాం. అందరూ ప్లాస్టిక్‌ను వ్యతిరేకించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించండిఅని ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు.