టికెట్‌పై రూ.40 మేర భారం

Published: Saturday August 10, 2019
ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వే నిర్ణయించడమే ఇందుక్కారణం. ఈమేరకు ముంబై మిర్రర్‌ పత్రిక à°“ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, ఆన్‌లైన్‌ టికెట్లపై సర్వీస్‌ చార్జిని తొలగించాలని రైల్వేకు ఆర్థిక శాఖ సూచించింది. అందుకయ్యే భారాన్ని తాము చెల్లిస్తామని తెలిపింది. అయితే.. à°ˆ ఏడాది జూలై 19à°¨ à°† చార్జిని పునరుద్ధరించుకోవాలని రైల్వేకు ఆర్థిక శాఖ తెలిపింది.
 
 
తాము పరిమిత సమయానికి మాత్రమే భారాన్ని భరిస్తామన్నామని తేల్చిచెప్పింది. అప్పటికే రూ.88కోట్ల భారాన్ని రైల్వేకు ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉండగా.. à°† మొత్తం చెల్లించినా ఐఆర్‌సీటీసీపై పడుతున్న భారం తీరదని రైల్వే బోర్డుకు అధికారులు నివేదిక పంపారు. à°ˆ నేపథ్యంలో సర్వీస్‌ చార్జిని పునరుద్ధరించుకునేందుకు అనుమతినిస్తూ ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసిందని ముంబై మిర్రర్‌ పేర్కొంది. సాధారణ స్లీపర్‌ బోగీలకు రూ. 20, ఏసీ బోగీలకు రూ.40 వరకూ ధరలు పెరగనున్నట్లు సమాచారం.