మళ్లీ వేలం విధానంలో బిడ్‌లకు ఆహ్వానం

Published: Saturday August 17, 2019
 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు, జల విద్యుత్కేంద్రం పనులకు శనివారం రివర్స్‌ టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సన్నద్ధమైంది. శుక్రవారం రివర్స్‌ టెండరింగ్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ జెన్‌కో నుంచి టెండర్‌ డాక్యుమెంట్లు వచ్చిన వెంటనే.. హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుకూ.. పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, గేట్ల బిగింపు, ఎగువ దిగువ కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌కూ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేయనుంది. జల విద్యుత్కేంద్రానికి రూ.3,220.22 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుకు రూ.1,850 కోట్ల కలిపి.. రూ.5070.22 కోట్ల అంచనాతో టెండర్లను పిలవాలని నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం రివర్స్‌ టెండర్‌ విధానంపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వు జారీ చేశారు. జూలై 22à°µ తేదీన జరిగిన చీఫ్‌ ఇంజనీర్ల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మేరకు వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. మార్గదర్శకాలు ఇవీ..
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పారదర్శకంగా ఉండేలా రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి వెళ్తున్నాం. ప్రాజెక్టుల్లో ఇంకా మిగిలిన పనులకు ప్రస్తుత కాంట్రాక్టు ధరను ఐబీఎంగా తీసుకుని రివర్స్‌ టెండర్‌ను పిలవాలి.

పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చే సంస్థల్లో తక్కువ ధరకు చేసే సంస్థకు అప్పగిస్తారు. వేలం తరహాలో ఇది ఉంటుంది.

కాంట్రాక్టు సంస్థల క్వాలిఫికేషన్‌.. 2003 జూలై 1à°¨ విడుదల చేసిన జీవో 94à°•à°¿ లోబడి ఉంటుంది.

సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్‌ చేసుకుని ఉండాలన్న నిబంధనను à°ˆ ఉత్తర్వు ద్వారా సడలించారు. ఇతర సంస్థలతో జాయింట్‌ వెంచర్‌, ఒప్పందాలు చేసుకుని కాంట్రాక్టు పనులకు ముందుకు రావచ్చు. పోటీ ఎక్కువగా ఉండేందుకు వీలుగానే రాష్ట్రంలోనే రిజిస్ర్టేషన్‌ చేసుకుని ఉండాలన్న నిబంధననను సడలించారు.

సరిపోయేంతలా బిడ్‌ రాకుంటే.. పనులను విడదీసి మళ్లీ బిడ్‌లను వేలం విధానంలో పిలుస్తారు.

కాంట్రాక్టు సంస్థను తప్పించిన సమయంలో మిగిలిన ఉన్న పనులకు గాను రివర్స్‌ టెండర్‌ కమ్‌ ఆక్షన్‌ను పిలుస్తారు. à°ˆ పనుల అనుభవం ఆధారంగా టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.

బిడ్డర్లు తమ అనుభవాన్ని సామర్థ్యాన్ని గురించి స్వీయ డిక్లరేషన్‌ ఇవ్వాలి.

à°ˆ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ప్రక్షాళన.

ఆర్థిక, సాంకేతిక క్వాలిఫికేషన్లను కూడా పూర్తిస్థాయిలో విశ్లేషించాకే.. అర్హతను నిర్ధారిస్తారు. ప్రీక్వాలిఫికేషన్‌ బిడ్డర్లు తమ అనుభవం, నైపుణ్యం, సామర్థ్యం, ఆర్థిక స్థోమత తదితర ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. వాటిపై సంతృప్తి చెందాకే ప్రీక్వాలిఫికేషన్‌ ఆమోదం లభిస్తుంది.

ఎల్‌-1ను బిడ్‌ ధరగా నిర్ధారిస్తారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన మూడు à°—à°‚à°Ÿà°² నుంచి బిడ్డింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. బిడ్‌à°² మధ్య అంతరం 0.5 శాతం ఉండాలి. ఎల్‌-1 బిడ్డర్‌ తనకు సంబంధించిన సపోర్టింగ్‌ డాక్యుమెంట్లను 24 గంటల్లోగా అందజేయాలి.