కేంద్రానికి పీపీఏ 18 పేజీల రిపోర్ట్‌

Published: Sunday August 25, 2019
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు, తమకు వర్తించబోవని పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. à°ˆ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం సాగునీటిప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నగదు మొత్తంతో ప్రమేయంలేకుండా 25 శాతంలోపు పనులు చేసిన వాటినే పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొందని, ఈవిధంగా చూసినా పోలవరం.. రివర్స్‌ టెండరింగ్‌ పరిధిలోకి రాదని పీపీఏ తెలిపింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో మిగిలిన కాంక్రీట్‌ పనులు, పోలవరం జల విద్యుత్కేంద్రం పనులకు రివర్స్‌ టెండర్లకు వెళ్లడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు పీపీఏ శుక్రవారం 18 పేజీల నివేదికను అందజేసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రివర్స్‌ టెండర్‌కు వెళ్లడం సహేతుకం కాదని స్పష్టం చేసింది.
 
à°ˆ నెల 13à°µ తేదీన హైదరాబాద్‌లో జరిగిన పీపీఏ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, à°ˆ నెల 16à°µ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు రాసిన లేఖలో వెల్లడించిన విషయాలనే మరో దఫా ఉటంకించిన పీపీఏ, రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రస్తుత రివర్స్‌ టెండర్‌ ప్రక్రియదాకా చోటు చేసుకున్న పరిణామాలను à°’à°• క్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు వివరించింది. రాష్ట్రప్రభుత్వ నిబంధనల మేరకే, బెకమ్‌ ఇన్‌ఫ్రా, నవయుగ సంస్థలకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల బాధ్యతలు అప్పగించినట్లు పీపీఏ తన నివేదికలో స్పష్టంచేసింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను 2020 ఏప్రిల్‌నాటికి పూర్తి చేస్తామని ‘నవయుగ’ స్పష్టం చేస్తుంటే .. రివర్స్‌ టెండర్‌లో 24 నెలలసమయం ఇవ్వడంవల్ల ఆరు నెలలు ఆలస్యమై .. à°’à°• పంటకాలాన్ని రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా పోలవరం సాగునీటిప్రాజెక్టు నిర్మాణం తర్వాత, దాని నాణ్యతకూ .. ఏదైనా ప్రమాదంవాటిల్లితే జరిగే నష్టానికి ఏ కాంట్రాక్టు సంస్థ బాధ్యత వహిస్తుందని పీపీఏ సందేహం వ్యక్తం చేసింది. రివర్స్‌ టెండర్‌లో à°—à°¤ ధరలకంటే .. తక్కువ ధరకు బిడ్‌లు వస్తాయన్న నమ్మకం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. పైగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పట్టిసీమ, పురుషోత్తపట్నం, తాటిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలు వినియోగించడం వల్ల విద్యుత్తుకే రూ.300 కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ పేర్కొంది.
 
ప్రస్తుతం పోలవరం పనులు చేపడుతున్న బెకమ్‌, నవయుగ సంస్థలను తప్పుబట్టేందుకు వీల్లేదని పీపీఏ స్పష్టంచేసింది. అదేవిధంగా రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో రాష్ట్ర జల వనరుల శాఖ సరైన హోం వర్కు చేయలేదని పేర్కొంది. 2009లో కాంట్రాక్టు సంస్థతో నెలకొన్న న్యాయవివాదాలు 2013 వరకూ తెగలేదని, నాలుగేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని పీపీఏ పేర్కొంది. కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే రాష్ట్ర జల వనరుల శాఖ స్పిల్‌వే 35 బ్లాకులు, స్పిల్‌ చానల్‌ 356 నుంచి 1540 బ్లాకుల పనులు 1244.36 కోట్లకు, స్పిల్‌వే 36నుంచి 52 బ్లాకులు, స్పిల్‌ చానల్‌ 1540 నుంచి 2920 బ్లాకులు, పైలట్‌ చానల్‌, ఎస్కవేషన్‌ పవర్‌హౌ్‌సను రూ.918.763 కోట్లు, గ్యాప్‌ 1,2,3, కాఫర్‌ డ్యామ్‌, అప్రోచ్‌ చానల్‌, డైవర్షన్‌ రోడ్‌ , స్పిల్‌ చానల్‌ బ్రిడ్జ్‌ రూ.751.55 కోట్లు మొత్తం కలిపి రూ.2914.67 కోట్లు పనులు నవయుగకు అప్పగించారని తెలిపింది. హైడ్రో మెకానికల్‌ పనులు, రేడియల్‌ గేట్లు, స్లూయిస్‌ గేట్ల బ్యాలెన్సు పనులు రూ.387.56 కోట్లను బెకమ్‌ సంస్థకు అప్పగించినట్టు పేర్కొంది.