నవరత్నాల కేలండరు విడుదల

Published: Wednesday August 28, 2019
 à°¸à±€à°Žà°‚ వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలకు తెరతీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసే నవరత్నాల కార్యక్రమాల శ్రీకారానికి సెప్టెంబరు మాసాన్ని మంచి ముహూర్తంగా నిర్ణయించారు. సంక్షేమ పథకా à°² కేలండర్‌ను మంగళవారం సచివాలయంలో కలెక్ట ర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కన్ఫరెన్సులో వై ఎస్‌ జగన్‌ ప్రకటించారు. వచ్చే నెల చివరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్నవారికి రూ.10 వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని సీఎం అదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు à°‡ చ్చే డబ్బు పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవాలని అధికారులను కోరారు.
 
దీనికి సంబంధించి బ్యాంకర్లతో ఉన్నతస్థాయిలో మాట్లాడుతున్నామని సీఎంకు అధికారు లు వివరించారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం à°¸ హా కొత్తగా బ్యాంకు అకౌంట్‌లను ప్రారంభించడంపై వలంటీర్లు దృష్టి సారించాలని జగన్‌ తెలిపారు. ‘‘à°¡ బ్బు జమకాగానే à°‡-రసీదులను లబ్ధిదారులకు అందజేయాలి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి కలెక్టర్లూ బ్యాంకు అధికారుల తో సమావేశం కావాలి. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల నుంచి అందే ప్రతి పైసా లబ్ధిదారునికే నేరుగా చేరాలని కేంద్ర అర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన విషయాన్ని జగన్‌ గుర్తు చేశారు.
 
‘‘నవంబరు 21à°¨ ప్రపంచ మత్స్య దినోత్సవం జరుపుతు న్నాం. సముద్రంలో వేటకువెళ్లే మత్స్యకారులకు రూ.10000 అందజేస్తాం. వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా à°ˆ సాయం అంది స్తాం. డీజిల్‌ పట్టించే సమయంలో మత్స్యకారులకు సబ్సిడీ అందేలా చూడాలి. ప్రస్తుతం రూ.ఆరుగా ఉన్న సబ్సిడీని రూ.తొమ్మిదికి పెంచుతున్నాం. నవంబరు 21 నుంచి అమలు చేస్తాం’’
 
 
‘‘డిసెంబరు 21à°¨ మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ ఏడాదికి రూ.24000 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి à°† సాయం చేతిలో పెట్టబోతున్నాం. à°ˆ పథకంపై అధికారులు దృష్టి సారించాలి’’
 
‘‘అమ్మ ఒడిని జనవరి 26à°¨ తీసుకువస్తున్నాం. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతిఅమ్మకూ రూ.15,000 అందజేస్తాం. ఫిబ్రవరి మొదటి వారంలో షాపులున్న నాయీబ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. వాటిని అమలు చేస్తాం. అదే నెలలో వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకను అమలులోకి తీసుకొస్తాం. ఇప్పుడున్న మొత్తాన్ని పెంచి ఇవ్వబోతున్నాం. మార్చి చివరి వారంలో ధూపదీప నైవేద్యాలు, మసీదులకు సంబంధించి ఇమామ్‌, మౌజమ్‌లకు, చర్చి పాస్టర్లకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అదే నెలలో 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని భారీస్థాయిలో చేపడతాం’’
 
 
‘‘వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఏదైనా వినతిని తిరస్కరించే ముందు దానిపై సరైన కసరత్తు చేయా లి. తిరస్కరిస్తున్న వినతులన్నీ కలెక్టర్‌ పరిశీలనకు రావాల్సిం దే. దీనికోసం కలెక్టర్‌ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయా లి. ఇష్టమొచ్చిన కారణాలు చూపి వినతులు తిరస్కరించేందుకు వీల్లేదు. అలాగే పెండింగ్‌ పెట్టిన వినతులపైనా దృష్టి సారించాలి. పెండింగ్‌ వినతుల సంఖ్య తగ్గాలంటే à°• చ్చితంగా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి’’ అని సీఎం అన్నారు.
 
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి క్రీడాకారులపై వరాలు కురిపించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. à°ˆ విషయంపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం చర్చించారు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాతజాతీయ స్థాయిలో పతకాలు సాఽధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందిద్దామన్నారు.
 
స్వర్ణం సాధించిన వారికి రూ.5 లక్షలు, రజతానికి రూ.4 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షలు అందించాలని చెప్పారు. జూనియర్‌, సబ్‌ జూనియర్‌ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో సాధించే స్వర్ణానికి రూ1.25 లక్షలు, రజతానికి రూ.75 వేలు, కాంస్యానికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆగస్టు 29à°¨ జాతీయ క్రీడా దినోత్సవం సంద ర్భంగా à°ˆ కార్యక్రమం చేపడదామని సీఎం అన్నారు