ఇక ప్లాస్టిక్‌ కవర్లతో ఇబ్బందులు పడనక్కర్లేదు

Published: Thursday August 29, 2019

శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకువెళ్లడానికి ఇక ప్లాస్టిక్‌ కవర్లతో ఇబ్బందులు పడనక్కర్లేదు. ఇందుకోసం చూడముచ్చటగా చక్కని జూట్‌బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగానే ఇది అమలులోకి వచ్చింది. టీటీడీ కోరిక మేరకు సెంట్రల్‌ జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాభనష్టాలు చూడకుండా తయారీ ధరకే జనపనార సంచులను విక్రయించడానికి అంగీకరించింది. దీంతో à°—à°¤ సోమవారం నుంచి వీటి విక్రయాలు లాంఛనంగా మొదలుపెట్టారు. తొలినాళ్లలో హాకర్లే రకరకాల బొమ్మలు ముద్రించిన ప్లాస్టిక్‌ కవర్లు లడ్డూ కౌంటర్ల వద్ద విక్రయించేవారు. కొంతకాలానికి హాకర్ల ఆగడాలు పెచ్చుమీరడంతో టీటీడీయే సొంతంగా కవర్ల విక్రయం ప్రారంభించింది. à°† తర్వాత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నిషేధం ఉద్యమంగా మారడంతో నిబంధనల మేరకు యాభై మైక్రాన్ల పైబడిన బయో డీగ్రేడబుల్‌ కవర్లను మాత్రమే తయారుచేయించి విక్రయిస్తూ వచ్చింది. ఇటీవల చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి వస్తుండడంతో టీటీడీ కూడా ఆదిశగా అడుగులువేసింది.