నెల రేషన్‌ వ్యయం 1.2కోట్లు.. రవాణా ఖర్చు 2.1 కోట్లు

Published: Friday August 30, 2019

చౌక బియ్యాన్ని ‘నాణ్యం’à°—à°¾ మార్చి, ప్యాకెట్‌ చేసి ఇంటికే అందించాలని ఆదేశించిన ప్రభుత్వానికి, à°† బియ్యం రవాణా వ్యవహారం ఇప్పుడు భరించరాని తలనొప్పిగానూ, మోయలేని ఆర్థికభారంగానూ మారింది. సాధారణంగా ఏ జిల్లాలోని బియ్యాన్ని అక్కడి అవసరాలకే వాడతారు. దానివల్ల రవాణా ఖర్చు పెద్దగా ఉండదు. అదేగనుక à°’à°• జిల్లా బియ్యాన్ని ఇంకో జిల్లాకు తరలించాల్సివస్తే మాత్రం, à°† వ్యయం తట్టుకోవడం కష్టమే! రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తున్న ’నాణ్యమైన బియ్యం’ పథకం ఇప్పుడు ఇలాంటి చిక్కులనే ఎదుర్కొంటోంది. శ్రీకాకుళం జిల్లా రేషన్‌ అవసరాల కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం పంపాలని నిర్ణయించడం పౌరసరఫరాల శాఖకు పెనుభారమే కానుంది. రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికి చేర్చాలనే నిర్ణయం వల్ల, పెద్దఎత్తున సంచుల అవసరం పెరిగి, పంపిణీ చేసే బియ్యం ఖర్చును అది మించిపోతుండటం ఇప్పటికే ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు బియ్యం రవాణా సమస్య కూడా చుట్టుముట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పథకాన్ని అమలు చేసేముందు శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘నాణ్యమైన బియ్యం’ కొరత ఎక్కువగా ఉండటం వల్ల, తొలి ఆరునెలలు à°ˆ ఒక్క జిల్లాకే à°ˆ పథకాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది. అయితే నాణ్యమైన బియ్యం శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో లేవు. à°† జిల్లా అవసరాల కోసం తూర్పుగోదావరిలో ఉన్న బియ్యాన్ని ప్రాసెసింగ్‌ చేస్తున్నారు.