యురేనియం తవ్వకాలతో రెండు రాష్ట్రాలకు ముప్పే

Published: Tuesday September 03, 2019
 
ప్రకృతి సరిగా ఉంటేనే హాయిగా జీవించగలం అనే నిజాన్ని పట్టణ వాసులు గుర్తించాలి. నల్లమలలో యురేనియం కోసం తవ్వితే ప్రజలకు ప్రాణవాయువు అయిన అడవులు నాశనమవుతాయి. దాంతో వాతావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. సకాలంలో వర్షాలు పడవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూమిలోని యురేనియంను వెలికితీసి, దాన్ని శుద్ధి చేసే క్రమంలో à°† రసాయన వ్యర్థాలన్నీ కృష్ణానదిలో కలుస్తాయి. దీంతో నదీజలాలు కలుషితమవుతాయి. అలా జరిగితే హైదరాబాద్‌ వాసులు à°† యురేనియం కలిసిన నీళ్లే రోజూ తాగాల్సివస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ హైదరాబాదీయులు కదం తొక్కాలి.
 
2005లో పెద్దగట్టు, లంబాపూర్‌ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ అందుకు అనుమతి కూడా ఇచ్చింది. ‘యురేనియం అంటూ తవ్వితే నగరానికి సరఫరా అయ్యే నీటి నాణ్యతను మేం కాపాడలేం’ అని ఆనాడు హైదరాబాద్‌ జలమండలి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం à°† రెండు ప్రాంతాలే కాదు, నల్లమలలోనూ తవ్వుతారట. యురేనియం కోసం విస్తృతంగా తవ్వకాలు చేపడితే ప్రజారోగ్యం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వ్యతిరేకించాలి.
 
యురేనియం తవ్వకాల వెనుక యుద్ధోన్మాద కాంక్షే కనిపిస్తుంది. రాజకీయ మనుగడ ఎప్పుడూ బలం ఆధారంగా సాగుతుంది. ‘‘మేము భారతదేశాన్ని చాలా బలవంతమైన దేశంగా తయారుచేశాను. మా వద్ద బాంబులున్నాయి’ అని పాలకులు చాటుకోవడం కోసమే అని నా అభిప్రాయం. దానివల్ల ప్రయోజనం శూన్యం. యురేనియంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసినా, దాని నుంచి వచ్చిన మిగిలిన వ్యర్థాలను బాంబుల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా చాలామంది శాస్త్రవేత్తలు ‘‘అణువిద్యుత్‌ను ఆపకుండా, అణుబాంబులను ఆపలేమని’’ చెబుతున్నారు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు అణుశక్తి లేకుండానే బాంబు తయారు చేసుకోలేదా అని భారత అణుశక్తి సంస్థ చెబుతుంది. అణుశక్తితో తయారుచేయడం సులువైన విధానం. ఖర్చు కూడా చాలా తక్కువ. అది యురేనియం రూపంలో రెడీమేడ్‌à°—à°¾ దొరుకుతుంది. అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తే వాటి నుంచి కావాల్సినన్ని బాంబులు తయారుచేసుకోవచ్చు.
 
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌ తదితర దేశాల్లో యురేనియం తవ్వకాలు జరిగాయి. తవ్వకాలతో ప్రమాదానికి గురికాని దేశం లేదు. అమెరికా, న్యూమెక్సికో రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు జరిపారు. కొన్నాళ్ల తర్వాత à°† ప్రాంతంలో ఊపిరితిత్తుల కేన్సర్‌, సిలికోసిస్‌ వ్యాధులతో మరణాలు పెరిగాయి. చర్చిరాక్‌ ప్రాంతంలో యురేనియం వ్యర్థాలు నిల్వచేసిన చెరువు కట్టలు తెగి, రియో పువర్కో నదిలో కలిశాయి. à°† నీళ్లన్నీ వృథా అయ్యాయి. అందులోని జీవులన్నీ మరణించాయి. à°† ప్రాంతమంతా బొందల గడ్డగా మారింది. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో.
 
ముడి ఖనిజం శుద్ధి చేసి యురేనియం తీసే యంత్రాంగం మన వద్ద ఉంది. రియాక్టర్ల నుంచి వాడేసిన ఇంథనం (స్పెంట్‌ ఫియల్‌ను), అందులోని అణుధార్మిక పదార్థాలను తొలగించి, వాటిని ప్రమాద రహితంగా చేసి నిక్షిప్తం చేసే వ్యవస్థ మన వద్ద లేదు. à°† వ్యర్థాలలోని ఫ్లుటోనియంను తీసి బాంబుల తయారీలో వాడతారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు à°’à°• ప్రాంతంలోనే చేపట్టడం లేదు. రెండుచోట్ల 38 à°š.à°•à°¿.మీ, మరో ప్రాంతంలో నాలుగు à°š.à°•à°¿.మీ, ఇంకో చోట మూడు à°š.à°•à°¿.మీ. తవ్వుతున్నారు. దాంతో అక్కడ తవ్విన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి సరఫరా చేసే క్రమంలో నల్లమల అడవి అంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. రవాణా సమయంలో ఏర్పడే వాహనాల రొదతో చాలా జీవరాశులు పారిపోతాయి. జంతువులు లేని అడవి అడవి కాదు