ప్రభుత్వమే ఇసుక సరఫరా చేసే ముహూర్తం దగ్గరపడింది

Published: Wednesday September 04, 2019

నూతన ఇసుక విధానంలో భాగంగా, ప్రభుత్వమే ఇసుక సరఫరా చేసే ముహూర్తం దగ్గరపడింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం గురువారం నుంచే ఇసుక సరఫరా ప్రారంభం కావాలి. అయితే, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉండటంతో, మొత్తంగా చూస్తే పాక్షికంగా ఇసుక సరఫరా ప్రారంభం కానుంది. వే బ్రిడ్జిలు, సీసీ కెమెరాలు ఇంకా ఏర్పాటుకాలేదు. అయినా ట్రాక్టర్లు, లారీల్లో పట్టే పరిమాణం కొలతల ప్రకారం నిర్ణయించిన ధర వసూలుచేసి సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఐదారు రోజులు à°ˆ à°°à°•à°‚à°—à°¾ సరఫరా చేసేసరికి...వేబ్రిడ్జ్‌లు, సీసీ కెమెరాల బిగింపు పూర్తవుతుందని గనుల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు రీచ్‌ తప్ప మరెక్కడా వీటి బిగింపు పూర్తికాలేదు. రాష్ట్రంలో మొత్తం 102రీచ్‌లు, 50స్టాక్‌ పాయింట్లకు టెండర్లు ఖరారు చేశారు. à°ˆ స్టాక్‌పాయింట్లలో ఇప్పటికే 38 పాయింట్లకు సంబంధించి టెండరుదారులతో ఏపీఎండీసీ ఒప్పందాలు చేసుకుంది. మిగిలినవాటికీ చేసుకుంటున్నారు. అయితే ఒప్పందాలు పూర్తి అయిన పాయింట్‌లలో కూడా కొన్నింటిలోకి ఇసుకను డంప్‌ చేసేందుకు వరదలు అడ్డంకిగా మారాయి. అటు గోదావరి, ఇటు కృష్ణా నదులు రెండింటిలోను నీరుండడంతో రీచ్‌లు ముంపులోనే ఉన్నాయి. కృష్ణా నదికి మళ్లీ కొంత వరద రావడంతో à°ˆ పరిస్థితి తలెత్తింది. అయినా వాటిలో 28 స్టాక్‌పాయింట్లలో ఇసుక డంప్‌ చేశారు. ఇందులో కనీసం 20స్టాక్‌పాయింట్ల నుంచైనా తొలిరోజున ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ à°Žà°‚à°¡à±€ భానుప్రకాశ్‌ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ జేడీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేబ్రిడ్జిలు, సీసీ కెమెరాల బిగింపును 5 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.