అరటి పంట పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం

Published: Thursday September 05, 2019

భారత్‌లో à°…à°°à°Ÿà°¿ పండు వినియోగం అధికం. à°…à°°à°Ÿà°¿ సాగులోనూ దేశం ముందంజలో ఉంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అనేకమంది à°…à°°à°¿à°Ÿà°¿ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే 2050 నాటికి భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో à°…à°°à°Ÿà°¿ పంట పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్‌లోని ఎక్స్‌టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు భారత్‌లో à°…à°°à°Ÿà°¿ ఉత్పత్తి క్షీణతకు దారితీయవచ్చని వారు తాజా అధ్యయనంలో గుర్తించారు. ప్రపంచానికి 86 శాతం అరటిని అందిస్తున్న 27 దేశాల్లో వారు à°ˆ అధ్యయనం నిర్వహించారు. à°ˆ క్రమంలో గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం ఉష్ణమండల పంట అయిన అరటిపై కీలక ప్రభావం చూపుతున్నాయని గుర్తించినట్టు వారు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అధికంగా à°…à°°à°Ÿà°¿ సాగు చేస్తున్న భారత్‌, బ్రెజిల్‌తోపాటు మరో ఎనిమిది దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా à°…à°°à°Ÿà°¿ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. పర్యావరణ మార్పులు ఇదే స్థాయిలో కొనసాగితే మరో 30 ఏళ్లలో à°…à°°à°Ÿà°¿ పంట పూర్తిగా మాయమైనా ఆశ్చర్యంలేదని శాస్రవేత్తలు పేర్కొన్నారు.