మద్యం దుకాణాల్లో పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన

Published: Monday September 09, 2019
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆదివారం సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో జరిగిన à°ˆ కార్యక్రమానికి వేల సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్‌ వైజర్‌, సేల్స్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం à°—à°¤ నెలలో ఎక్సైజ్‌ శాఖ ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్‌ డిపోల పరిధిలోని 280 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 280 సూపర్‌వైజర్‌ పోస్టులు, 665 సేల్స్‌మన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో సూపర్‌వైజ్‌ పోస్టులకు 4,144 మంది, సేల్స్‌మన్‌ పోస్టులకు 3,386 మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
వారందరి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆదివారం జేసీ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జరిగింది. అయితే à°ˆ సమాచారం ముందుగా అభ్యర్థులకు తెలుపకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది హాజరు కాలేకపోయారు. కొందరు అభ్యర్థులు ఆలస్యంగా అక్కడికి చేరుకుని ఎక్సైజ్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లోని పోస్టులను రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భారీగా ముడుపులు తీసుకుని కొందరికి కేటాయించేశారని, అందుకే తమకు సమాచారం కూడా ఇవ్వలేదంటూ వాపోయారు.
 
సూపర్‌వైజర్‌ పోస్టులకు డిగ్రీ, సేల్స్‌మన్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ విద్యార్హతగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొందరు డిగ్రీ, ఇంటర్‌ మార్కులు వందకు వంద వచ్చినట్లుగా నమోదు చేశారు. ఆదివారం అధికారులు జరిపిన సర్టిఫికెట్ల పరిశీలనలో à°ˆ విషయం బయటపడింది. ఇలా ఎందుకు చేశారని అభ్యర్థులను ప్రశ్నించగా, తమకు వచ్చిన మార్కులు ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే దరఖాస్తు తీసుకోలేదని, దీంతో ఎక్కువ మార్కులు పొందుపరిస్తే దరఖాస్తు తీసుకుందంటూ వివరణ ఇచ్చారు.
 
ఇదిలా ఉండగా ఆదివారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరిగింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. అలా ఎంపిక చేసిన వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, సర్టిఫికెట్ల పరిశీలనకు వేలమంది తరలిరావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. పలువురు అభ్యర్థులు వాహనాలను వీఆర్సీ మైదానం వెలుపల రోడ్డుపై నిలపడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.