విద్యుత్‌ లోటు భరించేదెవరు?

Published: Monday September 09, 2019
విద్యుత్‌ సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్ధిక లోటును ప్రభుత్వం భరిస్తుందా లేక ప్రజలపై భారం వేస్తారా...? దీనిపై ప్రస్తుతం విద్యుత్‌శాఖ వర్గాల్లో తీవ్రఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ముందు దాఖలు చేసిన ‘ట్రూ అప్‌’ పిటిషన్లు à°ˆ చర్చను లేవనెత్తాయి. తాము రూ.15,200కోట్ల మేర లోటును ఎదుర్కొంటున్నామని, దీన్ని భర్తీ చేసుకోవడానికి అనుమతివ్వాలని డిస్కంలు కొద్దిరోజుల క్రితం కమిషన్‌ ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. డిస్కంలు ఏటా రెండుసార్లు ఇటువంటి విజ్ఞప్తులు దాఖలు చేస్తాయి. రాబోయే సంవత్సరంలో సరఫరా చేయబోయే విద్యుత్‌, దానికయ్యే ఖర్చుకు సంబంధించిన అంచనాలను ఏఆర్‌ఆర్‌ పేరుతో నవంబరులో దాఖలు చేస్తాయి. దీనిపై బహిరంగ విచారణ జరపడంతో పాటు సొంతంగా కొంత మదింపు జరిపి ఏప్రిల్‌ నుంచి అమలయ్యేలా టారిఫ్‌ ఆర్డర్‌ను కమిషన్‌ జారీ చేస్తుంది. ఇది ఏడాది పాటు అమల్లో ఉంటుంది. డిస్కంలకయ్యే ఖర్చులను సబ్సిడీ రూపంలో భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చార్జీలు పెంచరు. లేకపోతే à°Žà°‚à°¤ లోటు ఉందో à°…à°‚à°¤ మొత్తం వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలుగా చార్జీల పెంపునకు కమిషన్‌ అనుమతిస్తుంది.
 
దీనితర్వాత ‘ట్రూ అప్‌’ పేరుతో మరో నివేదికను దాఖలు చేస్తాయి. ముందు వేసుకొన్న అంచనాలకు, వాస్తవ వ్యయానికి మధ్య తేడా వచ్చి ఖర్చు పెరిగితే దానిని పేర్కొంటూ à°ˆ నివేదికలను దాఖలు చేస్తాయి. సాధారణంగా ఏటా నవంబరులో ఏఆర్‌ఆర్‌ నివేదికలతో పాటే ట్రూఅ్‌పలు దాఖలు చేయడం పరిపాటి. కానీ ఈసారి డిస్కంలు ఆసక్తికరంగా ఆగ్‌స్టలోనే వీటిని దాఖలు చేశాయి. à°—à°¤ ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వీటిని దాఖలు చేయలేదని, అందువల్ల ఇప్పుడు దాఖలు చేశామని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటి దాఖలు వాయిదా పడటం తరచూ జరిగేదే అంటున్నాయి. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ట్రూఅ్‌పలు దాఖలు చేయలేదని, అన్నీ కలిపి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత దాఖలు చేశారని à°’à°• సీనియర్‌ అధికారి వెల్లడించారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో మొదటి రెండేళ్లకూ కలిపి ఒకసారి ట్రూఅప్‌ దాఖలు చేశారు.
 
అప్పుడు లోటు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో చార్జీల పెంపు యోచన తెరపైకి రాలేదు. ప్రభుత్వం మారిన తర్వాత డిస్కంలు మూడేళ్ల ట్రూ అప్‌ నివేదికలు ఒకేసారి దాఖలు చేసి భారీలోటు చూపించడంతో à°ˆ అంశం ఆసక్తికరంగా మారింది. కానీ నిజంగా ఇంత లోటు లేదని, కావాలని డిస్కంలు దాన్ని పెంచి చూపిస్తున్నాయని విద్యుత్‌ నిపుణులు కొందరు వాదిస్తున్నారు. వీరి వాదనలు వినడానికి బహిరంగ విచారణలు నిర్వహించడం ద్వారా à°ˆ లోటు ఎంతో రెగ్యులేటరీ కమిషన్‌ తేల్చాల్సి ఉంది. à°† లోటు తేలిన తర్వాత దానిని భర్తీచేసే మార్గాన్ని కూడా కమిషన్‌ ఖరారు చేయాల్సి ఉంటుంది. లోటును భరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే చార్జీలు పెంచామని నేరుగా చెప్పకుండా ఇంధన వ్యయం సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారులపై అదనంగా వడ్డించడం గతంలోనూ జరిగింది. ఈసారీ అదే జరుగుతుందని అంటున్నారు. ఇటువంటి చార్జీలు విధించాల్సి వస్తే ఈసారి భారీగానే ఉంటాయని విద్యుత్‌ శాఖ వర్గాలు అంటున్నాయి. ఉచిత విద్యుత్‌ వల్ల రైతులపై చార్జీలు వడ్డించలేరు. పరిశ్రమలకు ప్రోత్సాహకం పేరుతో వాటికీ పెంచే పరిస్థితి లేదు. వివిధ పేదవర్గాలకు 100- 200యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్నందువల్ల వారిపైనా భారం వేయలేరు. మధ్య తరగతి వినియోగదారులు, ఆపై వర్గాలవారు, వాణిజ్య కరెంటు వాడుకొనే వ్యాపారులు à°ˆ భారాన్ని భరించాల్సి వస్తుంది.
 
లోటు వ్యవహారంపై ప్రభుత్వం మనసులో ఏముందో ఇంకా స్పష్టత రాలేదు. తన ముందుకు వచ్చిన విజ్ఞాపనలపై రెగ్యులేటరీ కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టింది. ఏటా అనవాయితీగా నవంబరులో వేసే ఏఆర్‌ఆర్‌తో పాటు వీటిని జత చేయకుండా మధ్యలో దాఖలు చేయవచ్చా అన్నదానిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు మధ్యలో దాఖలు చేయడం సరికాదని కమిషన్‌ నిర్ణయిస్తే నవంబరులో ఏఆర్‌ఆర్‌తో పాటు మళ్లీ మరోసారి వాటిని డిస్కంలు దాఖలు చేయాల్సి ఉంటుంది. à°† సమయానికి ప్రస్తుత రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ భవానీశంకర్‌ పదవీ విరమణ చేసి కొత్తవారు à°† పదవిలోకి వస్తారు. ఇప్పుడు దాఖలు చేయడం న్యాయ సమ్మతమేనని కమిషన్‌ భావిస్తే వాటిపై బహిరంగ విచారణలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.