భారత్‌-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత

Published: Tuesday September 10, 2019
భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత మరింత తీవ్రరూపు దాల్చింది. పాక్‌-ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) కొన్ని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు జరిపింది. లీపా లోయలో కొన్ని స్థావరాలున్నట్లు గుర్తించిన మీదట ఆర్మీ సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు జరిపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి. à°ˆ స్థావరాలన్నీ పాకిస్థానీ ఆర్మీ పోస్టులకు సమీపంలోనే ఉన్నాయి. భారత సరిహద్దు గ్రామాలపైకి నిరంతర మోర్టారు దాడులు, కాల్పులు జరిపేందుకు పాక్‌ సైన్యం అక్కడ తిష్టవేసింది. దాని మద్దతుతోనే ఉగ్ర శిబిరాలూ వెలిశాయి. à°ˆ కాల్పుల మాటున సుశిక్షితులైన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం అసలు లక్ష్యం. కానీ నిరంతరం అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం మొదటే దెబ్బతీసింది. పీవోకేలో తరుచూ ఉగ్రస్థావారాలను మారుస్తూ, టెర్రరిస్టులను వివిధ ప్రదేశాలకు పాక్‌ సైన్యం పంపుతోంది. తాజాగా à°ˆ ఉగ్రవాద శిబిరాలను రావల్కోట్‌, తర్నూతీ ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ సంస్థ నిర్వహిస్తోంది. నియంత్రణ రేఖ దాటి, జమ్మూ కశ్మీర్లోకి చొరబడి, భద్రతా బలగాలపై గానీ, ఏదేనా ప్రార్థనా స్థలంలో గానీ భీకర దాడి చేయాలన్నది ఉగ్రవాదులకు శిక్షణ సమయంలోనే ఇస్తున్న లక్ష్యం. కాగా, కరడు గట్టిన ఉగ్రవాద నేత- మౌలానా మసూద్‌ అజార్‌ను పాక్‌ రహస్యంగా విడుదల చేసినట్లు తాజాగా నిఘా వర్గాలకు సమాచారమందింది.
 
ఉగ్రవాదులను కూడదీసి, మారణ హోమం సృష్టించే పథక రచనకు వీలుగా ఆయనకు స్వేచ్ఛనిచ్చారు. బహావల్‌పూర్‌లోని మర్కజ్‌ సుభానల్లా ప్రాంతంలో ఆయన నిర్బంధంలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం దెబ్బతిందనీ ఇటీవలే పాక్‌ వెల్లడించింది. కానీ అది నిజం కాదనీ, ఇపుడు స్వేచ్ఛగా సంచరిసున్నారనీ తాజాగా తెలుస్తోంది. మరో ఉగ్రవాద నేత హఫీజ్‌ సయీద్‌ను కూడా à°ˆ మధ్యే విడుదల చేసి కశ్మీర్లో చిచ్చు రేపాలని కోరినట్లు సమాచారం. మరోవైపు, లష్కరే తయీబాకు చెందిన 8 మంది ఉగ్రవాదులను సోపోర్‌ జిల్లాలో అరెస్టు చేశారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు పట్టుబడడం ఇదే ప్రథమం. దుకాణాలు తెరవొద్దనీ వ్యాపారులను బెదిరిస్తూ వీరు కాల్పులకు కూడా తెగబడ్డారు.