2.1 కి.మీ. ఎత్తున కాదు.. 400 మీటర్ల ఎత్తున

Published: Thursday September 12, 2019
ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడిపై దిగే క్రమంలో దాన్నుంచి సంకేతాలు ఆగిపోయింది చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తునకాదా? కేవలం 400మీటర్ల ఎత్తున ఉన్నప్పుడా? ఖగోళశాస్త్రజ్ఞులు దీనికి ఔననే అంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ల్యాండర్‌ చంద్రుడిపై దిగేటప్పుడు à°† క్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు గుర్తుందా? à°† సమయంలో విక్రమ్‌ ప్రయాణాన్ని విశ్లేషించి వారు à°ˆ నిర్ణయానికి వచ్చారు. వారి విశ్లేషణ ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40గంటలకు(తెల్లవారితే శనివారం) విక్రమ్‌.. కక్ష్య నుంచి చంద్రుడి వైపు బయల్దేరింది. 1.50 గంటలకు బెంగళూరులోని ఇస్రో కమాండ్‌ సెంటర్‌లో నిశ్శబ్దం రాజ్యమేలింది. శాస్త్రజ్ఞుల ముఖాల్లో తీవ్రఆందోళన. ‘చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ విక్రమ్‌ ల్యాండర్‌ ప్రణాళిక ప్రకారమే దిగింది. దాని పనితీరు సాధారణంగానే ఉంది. à°† తర్వాత ల్యాండర్‌ నుంచి గ్రౌండ్‌ సెంటర్‌కు సం బంధాలు తెగిపోయాయి’ అని తెల్లవారుజాము 2.18 గంటలకు ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ ప్రకటించారు. అప్పటిదాకా ఇస్రో మిషన్‌ కాంప్లెక్స్‌ సెంటర్‌లోని కంప్యూటర్‌ తెరలపై ల్యాండర్‌ మార్గాన్ని చూపిన సంగతి తెలిసిందే. అందులో ఆకుపచ్చ రంగులో చిన్న చుక్కలా ఉన్నదే ల్యాండర్‌. మధ్యలో ఉన్న ఎర్ర గీతే ల్యాండర్‌ నిర్దేశిత మార్గం.
 
చాలాసేపటి వరకూ అది ఆమార్గంలోనే వెళ్లింది. చంద్రుడికి 5నుంచి 3కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దారి కొద్దిగా మళ్లింది(ఆకుపచ్చ గీత). అదంత పట్టించుకోవాల్సినంత పెద్ద తేడా కాదు. కానీ 2.1కిలోమీటర్ల ఎత్తున అది నిర్దేశిత మార్గాన్ని వీడి ఎక్కువ దూరం వెళ్లింది. సరిగ్గా 400 మీటర్ల ఎత్తున à°† ఆకుపచ్చ గీత ఆగిపోయింది. అంటే.. ల్యాం డర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 400 మీటర్ల ఎత్తుకు వెళ్లేదాకా ఇస్రో కమాండ్‌సెంటర్‌కు సంకేతాలు పంపుతూనే ఉందని శాస్త్రజ్ఞులు గుర్తుచేస్తున్నారు. మరి à°ˆ తేడా ఎందుకు వచ్చిందంటే.. శివన్‌ చేసిన ప్రకటనను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంవల్లేనని వారు వివరిస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల వరకూ ల్యాండర్ ప్రణాళిక ప్రకారమే దిగిందని.. à°† తర్వాత సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు. అంటే..‘à°† తర్వాత’ అనే పదంలోనే అసలు కీలకమంతా ఉందని, సంకేతాలు ఆగే సమయానికి విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 400మీటర్ల ఎత్తున ఉందని వారు అన్నారు. వీలైనంత త్వరగా విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ జీవితకాలం చంద్రుడి మీద à°’à°• పగలు మాత్రమే. మన లెక్క ప్రకారం 14 రోజులు. 4 రోజులు ఇప్పటికే గడిచిపోయాయి. మిగిలిన రోజుల్లో కనుక్కోలేకపోతే విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణ అసాధ్యం.