4 నెలల్లో కొత్త జిల్లాలు

Published: Thursday September 12, 2019

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి వచ్చే జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో బుధవారం మాట్లాడినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని à°’à°• జిల్లాగా చేయాలని భావిస్తున్నట్లు వివరించినట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని పేర్కొన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారని అంటున్నారు. దీనిపై గవర్నర్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.