పీపీఏల పునఃసమీక్షపై హైకోర్టుకు వివరించిన ఏజీ

Published: Saturday September 14, 2019
 à°µà°¿à°¦à±à°¯à±à°¤à±‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు భారీ నష్టాల్లో ఉన్నందున ఆర్థిక పరిస్థితి అదుపు తప్పకుండా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను పునఃసమీక్షించేందుకే విద్యుదుత్పత్తి సంస్థల్ని చర్చలకు ఆహ్వానించామని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అంతే తప్ప ఇప్పటికిప్పుడు పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు తెలియజేశారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడం తప్ప ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. పీపీఏలపై సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్‌ఎల్‌ఎ్‌ససీ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం à°—à°¤ నెలలో జారీ చేసిన జీవో 63ను, విద్యుత్‌ ధరల తగ్గింపు కోసం హెచ్‌ఎల్‌ఎ్‌ససీతో సంప్రదింపులు జరపాలంటూ ఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ తమకు రాసిన లేఖను సవాల్‌ చేస్తూ పవన, సౌర విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. à°ˆ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు ముందు విచారణ జరుగుతోంది. à°ˆ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.
 
విద్యుదుత్పత్తి సంస్థలను ప్రస్తుతానికి సంప్రదింపుల కోసమే ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. à°—à°¤ ప్రభుత్వం తీసుకుంటున్న పవన విద్యుత్‌లో 63 శాతం 3 సంస్థల నుంచే వస్తోందని, ఇందులో ఎన్నో మతలబులున్నాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే à°“ కమిటీని ఏర్పాటు చేసిందని, à°† కమిటీ నివేదికను పరిశీలిస్తే అసలు నిజాలు వెల్లడవుతాయని చెప్పారు. విచారణ కొనసాగుతోందంటూ ఇప్పటి వరకు ఉన్న వివరా లను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు నివేదించారు. విద్యుత్‌ ధరల నిర్ణయం, ఒప్పందాల కొనసాగింపు తదితరాలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ)దే తుది నిర్ణయమని పిటిషనర్లే చెబుతున్నందున, కావాలంటే à°† మండలినే ఆశ్రయించవచ్చన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలోనూ బకాయిలు చెల్లించలేదని, దీనిపైనా ఈఆర్‌సీకే వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. వాదనల అనంతరం న్యాయమూర్తి.. తదుపరి విచారణను à°ˆ నెల 18à°µ తేదీకి వాయిదా వేశారు