కోడెలపై పెట్టిన ప్రతి కేసుకూ మీరు జవాబు చెప్పాలి

Published: Wednesday September 18, 2019
‘పోలీసులూ.. జాగ్రత్త! మాజీ స్పీకర్‌ కోడెలపై నమోదుచేసిన ప్రతి కేసుకూ మీరు సమాధానం చెప్పాల్సిఉంటుంది.. చిన్న చిన్న కేసులకూ జీవిత ఖైదు విధించే సెక్షన్లు మోపుతారా’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని, ఇది ముమ్మాటికీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యేనని స్పష్టం చేశారు. ఆయన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించి చంపారన్నారు. మంగళవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో కోడెల భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ, గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్విటర్‌లోనూ స్పందించారు. పోలీసులతో పాటు ఆలిండియా సర్వీసెస్‌ ఉద్యోగులు మొత్తం వైసీపీ ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. à°ˆ పరిణామం రాష్ట్రానికి అరిష్టమన్నారు. రెండు నెలల్లో కోడెలపై 19 కేసులు పెట్టారని.. ఇవన్నీ à°—à°¤ మూడేళ్లలో జరిగాయంటున్నారని, వేటిలోనూ అవి ఏ తేదీన జరిగాయో చెప్పలేదని తెలిపారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విటర్‌లో, జగన్‌ పత్రికలో, చానల్లో పదే పదే ఆయన్ను విమర్శిస్తూ కథనాలు రాయించారన్నారు.
 
‘చిన్న కేసులకు జీవిత ఖైదు సెక్షన్లు మోపుతారా..? లక్ష రూపాయల ఫర్నిచర్‌ మాయం కేసులో మాజీ స్పీకర్‌పై జీవితకాలపు శిక్ష పడే సెక్షన్లు ఎలా నమోదు చేస్తారు? దీనికే జీవిత కాలం శిక్షయితే రూ.43 వేల కోట్లు దోచుకుని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారిపై ఏ సెక్షన్లు పెట్టాలి. à°’à°• సైకో ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు తమ విధులు మరచిపోతున్నారు. మా పాలనలో పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే.. ఇప్పుడు కేవలం తప్పుడు కేసులు పెట్టడానికే వారు పరిమితమయ్యారు. ఒక్క కోడెలపైనే కాదు.. రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు, సోషల్‌ మీడియా వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు’ అని విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా మౌనం వీడాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..
 
‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అంశాలపై పోరాడినా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా అభివర్ణించాలో అర్థం కావడం లేదు. జగన్‌ ప్రభుత్వం టెర్రరిస్టు ప్రభుత్వమని పారిశ్రామికవేత్త మోహన్‌దాస్‌ పాయ్‌ అన్నారు.. కానీ టెర్రరిస్టుల కన్నా ఎక్కువ. టెర్రరిస్టులకు లాజిక్‌ ఉంటుంది. à°’à°• వ్యక్తిని à°’à°• షాట్‌లో చంపేస్తారు.. కానీ జగన్‌ ప్రభుత్వం కోడెలను మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వేధించి వేధించి దిక్కుతోచని స్థితికి నెట్టివేసి జీవితాన్ని ముగించుకునేలా చేసింది. పల్నాటి పులిగా గుర్తింపు పొందిన కోడెల కూడా భయపడిపోయారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు వేధించారని.. ధైర్యంగా ఉండమని కోడెలకు చెప్పినా ఉండలేకపోయారు. ఆయన తప్పు చేస్తే.. అందుకు శిక్ష వేస్తే అభినందించేవాడిని. కానీ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందిపెట్టి మరణించేలా చేయడం క్షమించరాని నేరం. à°’à°• చిన్న కేసును పట్టుకుని ఆయన్ను హింసించి కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారు. ఆయనపై à°’à°• ముద్రవేసి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు.’
 
‘దేశ చరిత్రలో తొలిసారిగా à°’à°• సీనియర్‌ నాయకుడు.. అందునా స్పీకర్‌à°—à°¾, మంత్రిగా, పనిచేసిన వ్యక్తి జీవితం ఇలా ముగిసిపోవడం బాధాకరం. ఆయన్ను ఏ రీతిన చంపేశారో ప్రతి ఇంట్లో, మేధావుల్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. జగన్‌ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోంది. దాని మెంటల్‌ కండిషన్‌ ఏమిటి? బుద్ధి, జ్ఞానం ఉన్నవారు పరిపాలన చేస్తారు కానీ సీఆర్‌డీఏను రద్దుచేయడం, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం, రాజధాని పనులను నిలిపివేయడం వంటి చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి? నేను ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశా.. 11 మంది ముఖ్యమంత్రులను చూశా.. ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదు.. మొత్తం చంపేస్తారా? అందరినీ ఆత్మహత్యలు చేసుకునేలా వేధిస్తారా?’