ఆర్టికల్‌ 370 కాదు.. ఉగ్రవాదమే అసలు సమస్య

Published: Wednesday September 18, 2019
పాక్‌-ఆక్రమిత కశ్మీర్‌పై భారత్‌ తన స్వరాన్ని ఉధృతం చేసింది. పీవోకే ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దీనిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని, ఇందులో అనుమానమే అక్కర్లేదని విదేశాంగమంత్రి ఎస్‌ జయశంకర్‌ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు అంతర్జాతీయ సమాజానికి ఆయన à°ˆ కీలక సందేశాన్ని ధాటిగా వినిపించడం విశేషం. చర్చలంటూ జరిగితే ఇక పీవోకేపైనేనని ఉపరాష్ట్రపతి à°Žà°‚ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ సహా మోదీ కేబినెట్లోని అనేకమంది మంత్రులు చాలా సందర్భాల్లో పీవోకే స్వాధీనంజరిగితీరుతుందని చెబుతుండడంతో కేంద్రం à°ˆ విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తోందా.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కొద్దిరోజుల్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలు జరగనుండడం, అక్కడ మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లిరువురూ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తనుండడంతో జయశంకర్‌ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పదవి చేపట్టాక తొలిసారి మంగళవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడిన జయశంకర్‌- కశ్మీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1972 నుంచీ కశ్మీర్‌పై మన వైఖరి ఒకటే. పీవోకే భారత్‌లో à°’à°• భాగం. ఇది మారదు. ఇక ఆర్టికల్‌ 370 అనేది భారత ఆంతరంగిక వ్యవహారం. 370ని భారత్‌ ఎందుకు నిర్వీర్యం చేసిందో ప్రపంచదేశాలు అర్థం చేసుకున్నాయి. ఇక పాకిస్థాన్‌కు సంబంధించినంత వరకూ ఆర్టికల్‌ 370 అన్నది అంశమే కాదు. సీమాంతర ఉగ్రవాదమే ప్రధానాంశం.
 
చర్చలే జరిగితే మొదట తేలాల్సింది ఉగ్రవాదమే తప్ప మా à°ˆ నిర్ణయం కాదు’’ అని జయశంకర్‌ స్పష్టం చేశారు. ‘‘మన పొరుగుదేశం నుంచి à°“ ప్రత్యేకమైన సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచేసి à°“ సాధారణ పొరుగుదేశంగా మారే దాకా à°ˆ సవాలు ఉంటూనే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల ప్రధానులూ ఇప్పట్లో భేటీ అయ్యే అవకాశాలు లేవన్నారు. హ్యూస్టన్‌లో 22à°¨ జరిగే హౌడీ మోదీ సభ అత్యంత కీలకమని, ప్రపంచ దేశాలన్నీ దాన్ని ఆసక్తికరంగా గమనిస్తాయని చెప్పారు.