మీ ’సేవ‘లు..ఇక చాలు?

Published: Thursday September 19, 2019
ఇప్పటిదాకా దశాబ్దకాలం పాటు ప్రజలకు పన్నులు చెల్లింపు దగ్గర నుంచి కరెంటు బిల్లుల వరకు సాయపడిన ‘మీ-సేవ’ కేంద్రాలు అదృశ్యం కాబోతున్నాయి. పల్లెల నుంచి పట్టణం దాక ఇకముందు ప్రభుత్వ సర్వీసులన్నీ సచివాలయాల కేంద్రంగా విరాజిల్లబోతున్నాయి. మీ-సేవ పేరును సైతం మార్చివేస్తున్నారు. పాలనా సంస్కరణల్లో భాగంగా శరవేగంగా à°ˆ మార్పులు, చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రస్తుత ప్రజా సర్వీసుల నిర్వహణకు వీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని అర్ధంతరంగా పదవుల నుంచి ప్రభుత్వం పక్కనపెట్టింది. దీంతో మీ-సేవ కేంద్రాలకు ప్రభుత్వం దాదాపు మంగళం పాడినట్టే.
 
à°—à°¤ దశాబ్ధకాలం క్రితం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సర్వీసులు మరింత చేరువయ్యేందుకు వీలుగా రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల ఆవిర్భావం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా à°† తర్వాత à°ˆ కేంద్రాలు నిలదొక్కుకున్నాయి. ప్రజలు కూడా à°ˆ కేంద్రాలకు చేరువయ్యారు. పన్ను చెల్లింపు దగ్గర నుంచి కావాల్సిన దరఖాస్తులు పొందేందుకు కూడా à°ˆ కేంద్రాలే ఆలవాలంగా మారాయి. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2009లో మీ-సేవ కేంద్రాలకు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఒకవైపు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేస్తూనే మరోవైపు చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు మీ-సేవ కేంద్రాలు ఉపకరించాయి. అప్పటి నుంచి ఇప్పటిదాక ప్రజాసర్వీసులు à°ˆ కేంద్రాల్లో విస్తరిస్తూ వచ్చాయి. ఒకానొక దశలో కొన్ని సర్టిఫికెట్ల జారీకి మాత్రమే పరిమితం అయినా à°† తర్వాత 240 పైగా సర్వీసులు విస్తరించారు. దీంతో కరెంటు బిల్లు కట్టాలన్నా, పోయిన దరఖాస్తు స్థానంలో సరికొత్తగా ఇంకొకటి పొందాలన్న ఆన్‌లైన్‌ ద్వారా సేవలను అందుకునే వీలుగా à°ˆ కేంద్రాలను తీర్చిదిద్దారు.
 
దాదాపు జిల్లాలో 144కు పైగా మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలతో అనుసంధానం అయ్యి ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో à°ˆ కేంద్రాల్లో ప్రజావసరాలను తీర్చేందుకు సర్వీసులను మరింత విస్తరించారు. ఆఖరికి భూసంబంధమైన రికార్డులను ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. అవినీతిని తగ్గించడం, ప్రజలకు జవాబుదారీ పెంచడం వీటి లక్ష్యం. అయితే ఒక్కసారిగా à°ˆ కేంద్రాలకు మంగళం పాడేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలకు దిగారు. తాజాగా వలంటీర్లను ఎక్కడికక్కడ నియమించారు. ఇంకోవైపు గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. à°ˆ సచివాలయాలే భవిష్యత్‌లో ప్రజాసేవా కేంద్రాలుగా మారబోతున్నాయి. సాధ్యమైనంత మేర ఎక్కువ సంఖ్యలో సేవలను అందించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజల సంతృప్తిని దృష్టిలో పెట్టుకుని సచివాలయాల వ్యవస్థకు మరింతగా పదును పెడుతున్నారని భావిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రస్తుతం ఏపీ ఆన్‌లైన్‌ పేరిట ఇప్పటిదాక నిర్వహించిన సేవల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు.
 
ప్రస్తుతం ఏపీ ఆన్‌లైన్‌ à°•à°¿à°‚à°¦ వివిధ జిల్లాల్లో మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వారిని ప్రభుత్వం పక్కనపెట్టింది. పశ్చిమతో సహా మరో రెండు జిల్లాల్లో à°ˆ తరహా మార్పులు లేనప్పటికీ మిగతా పది జిల్లాల్లోనూ మేనేజర్ల వ్యవస్థకు తెరదించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు మీసేవ కేంద్రాల నిర్వహణలో మూలంగా ఉన్న ఏపీ ఆన్‌లైన్‌ పేరులోనూ మార్పులు వచ్చిపడ్డాయి. దీనికి బదులుగా సిటిజన్స్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ ఏపీగా మార్పు చేశారు. అంటే మొత్తంమీద మీ-సేవకు ఇక కాలం చెల్లినట్టే.