ఏబీఎన్‌, టీవీ5 నిషేధంపై కొనసాగిన నిరసనలు

Published: Thursday September 19, 2019
ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా విధించిన నిషేధంపై జర్నలిస్టు సంఘాలు సహా రాజకీయ నేతలు భగ్గుమన్నారు. నిషేధ సంకెళ్లను తక్షణమే తొలగించాలనే డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఆయా నిరసనలకు వామపక్షాలు, టీడీపీ నాయకులు సహా పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎక్కడికక్కడ జగన్‌ ప్రభుత్వం మీడియాపై అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాయి. బుధవారం కర్నూలు నగరంలో సీపీఎంతోపాటు ఆపార్టీ అనుబంధ సంఘాలు, ఐద్వా, విద్యార్థి, కళా, జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా, మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం, రాజ్‌విహార్‌ కూడలిలోని స్వామి వివేకానందుడి విగ్రహం ముందు మానవహారంగా నిలబడి ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు. కర్నూలు మాజీ మేయర్‌ బంగి అనంతయ్య, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. నిర్మల మాట్లాడుతూ, భావప్రకటనా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు.
 
ఏబీఎన్‌, టీవీ 5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం సీనియర్‌ నేత పుల్లారెడ్డి, ఏపీయూడబ్లుజే ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. మీడియాపై నిషేధమా సిగ్గుసిగ్గు అంటూ అనంతపురంలో జర్నలిస్టులు కదం తొక్కారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకులు ప్రసాద్‌, విశ్వ, కార్తీక్‌, యశ్వంత్‌, పవన్‌, బాబీలు మాట్లాడుతూ.. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదన్నారు. ఫోర్త్‌ ఎస్టేట్‌ను పాతిపెడతారా? అంటూ సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో న్యాయవాదులు ఉద్యమించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి జిల్లా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా జడ్జి శ్రీనివా్‌సకు వినతిపత్రం సమర్పించారు. రాజంపేటలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వినూత్న రీతిలో ఉరి వేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను సమాధి చేస్తారా అంటూ శ్రీకాకుళంలో జర్నలిస్టులు వినూత్న రీతిలో జలదీక్షలు చేశారు. నాగావళి నదిలో ప్లకార్డులు చేతపట్టుకొని జలదీక్ష నిర్వహించారు.
 
సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఎస్‌.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో స్థానిక ప్రెస్‌క్లబ్‌ సభ్యులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మీడియాపై కక్ష కడతారా అనే నినాదాలతో పశ్చిమగోదావరి జిల్లా హోరెత్తింది. జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు ఇదొక నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విశాఖలో జర్నలిస్టులు ఎంఎ్‌సవో, ఎస్‌డీవో à°Žà°‚à°¡à±€ ఇసుకపల్లి రామకృష్ణంరాజుకు వినతిపత్రం అందజేశారు.