పోస్టులు మిగిలిపోవడంతో ఇద్దరి పని ఒకరిమీదే

Published: Saturday September 21, 2019
నిత్యం సమావేశాలు, శిక్షణ, సర్వేలతో వార్డు, గ్రామ వలంటీర్లు జిల్లాస్థాయి అధికారుల కంటే బిజీగా కనిపిస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వలంటీరు పోస్టులు ఇంకా పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. నియామక పత్రాలు అందుకుని వేర్వేరు కారణాలతో కొంతమంది.. పని ఒత్తిడి కారణంగా మరికొందరు నిలిచిపోయారు. దీంతో ఇద్దరి పని ఒకరే చేయాల్సి వస్తోంది. ఇటీవలే వీరు ఇంటింటి సర్వే పూర్తి చేయగా.. తాజాగా ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేసే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. ఇంత చేసినా.. వారి ఖాతాల్లో గౌరవ వేతనం జమయిందా అంటే.. అదీ లేదు. యాప్‌ ద్వారా ఓటు నమోదు, ఓటర్ల జాబితా మార్పు- చేర్పులు చేపట్టాలని తాజాగా అధికారులు సూచించిన నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లు లేని వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు.
 
మండలాల్లో 16,199 గ్రామ వలంటీర్లు, కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో మరో 5,386 వార్డు వలంటీరు పోస్టులు ఉన్నాయి. అనేక రకాల కారణాలతో గ్రామాల్లో 20, పట్టణాల్లో 50శాతం పోస్టులు భర్తీ కాలేదు. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వలంటీర్లకు అదనపు పనిభారం పడింది. మీరు అదనంగా చేసిన పనికి అదనపు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన అధికారులు చివరకు చేతులెత్తేశారు. నాలుగు రూపాయలు వస్తాయని రాత్రింబవళ్లు పనిచేసిన వారికి నిరాశే మిగిలింది. మండల, పట్టణ స్థాయి అధికారులు అవగాహనలేక వలంటీర్లకు à°ˆ విధమైన హామీ ఇవ్వడంతో నిజమే అనుకుని వారంతా పనిచేశారు. కానీ జిల్లా అధికారులు అదనపు పనికి అదనపు పేమెంట్‌కు ఒప్పుకోలేదని సమాచారం.
 
నకిలీ రేషన్‌కార్డులను తొలగించే క్రమంలో, ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు పొందుతున్న వారి కార్డులను ముందుగా తొలగించింది. ఇది మంచిదే. కానీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నెలకు రూ.10వేల గౌరవ వేతనం పొందుతున్న 1800మంది వీఆర్‌ఏల రేషన్‌కార్డులను తొలగించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.60, పట్టణాల్లో రూ.75 వేల వరకు వార్షికాదాయం ఉన్నవారికి మాత్రమే రేషన్‌కార్డు ఉండాలి. వారే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు లెక్క. à°ˆ లెక్కన వీఆర్‌ఏల గౌరవ వేతనం ఏడాదికి రూ.1.20 లక్షలవుతోందని తొలగించారు. ఇక వీరి కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు. అంతేకాదు.. రేషన్‌కార్డులోని వ్యక్తి భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి అయినా (కార్డులో లేనప్పటికీ..) à°† కార్డు పనిచేయడం లేదు. à°ˆ నేపథ్యంలో వలంటీర్లకు రూ.5వేల గౌరవ వేతనం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఇవ్వనున్నారు. నెలకు రూ.5 వేల చొప్పున వీరి వార్షికాదాయం రూ.60 వేలు అవుతుంది. దీంతో వలంటీర్లలోనూ తమ రేషన్‌కార్డులు ఉంటాయా.. ఊడిపోతాయా.. అనే ఆందోళన నెలకొంది.