ప్రైవేటు ట్రావెల్స్‌ టిక్కెట్ల దోపిడీ

Published: Monday September 23, 2019
మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రానున్నది. à°ˆ పర్వదిన సెలవుల్లో సరదాగా తమతమ గ్రామాలకు వెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇదే ఆసరాగా అటు ప్రైవేటు ట్రావెల్స్‌, ఇటు ఆర్టీసీ దసరా దందాకు తెరలేపాయి. రెట్టింపు చార్జీల దోపిడీకి సిద్దమవుతు న్నాయి. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమా న్యాలు అయితే ఇప్పటికే టిక్కెట్ల కృత్రిమ కొరత సృష్టించి రెట్టింపు ధరలతో చార్జీలను వసూలు చేస్తున్నారు. రవాణాశాఖ అధికా రులు పట్టించుకోక పోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఇష్టారీతిలో చార్జీలను వసూలు చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ప్రభుత్వ ప్రజారవాణా ఆర్టీసీ సైతం స్పెషల్‌ బస్సులకు 50 శాతం అదనపు చార్జీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. దీంతో పండుగకు స్వస్థలాలకు వెళ్ళే ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
 
దసరా పర్వదినానికి దూర ప్రాంతాల్లో విద్యా, ఉద్యోగం ఇతర పనుల్లో ఉండే వారు తమ కుటుంబ సభ్యులతో జరుపుకు నేందు కు సొంత ఊళ్ళకు వస్తుంటారు. హైదరా బాద్‌, చెన్నై, బెంగళూరు, వైజాగ్‌ వంటి దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిం చే వారు అధికంగా ఉంటారు. ఇందు కోసం ఇప్పటికే బస్సులకు రిజర్వేషన్‌లు చేసుకుం టున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ యాజ మాన్యాలు కృత్రిమ కొరతకు తెరతీస్తు న్నాయి. బుకింగ్‌ ఫుల్‌ అయిపో యాయం టూ ప్రయాణికులకు టెన్షన్‌ పుట్టిస్తున్నారు. అక్టోబరు 8à°¨ దసరా పర్వ దినం. కాగా అదే రోజు రాత్రికి గుంటూరు నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, వైజాగ్‌ వెళ్ళేవారు అధికంగా ఉంటారు. 8à°µ తేదీ లేక 9à°µ తేదీని రాత్రికి, 13à°µ తేదీ ఆదివారం రాత్రికి ఇప్పటి నుంచే రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ఇదే ఆసరగా చేసుకుంటోన్న కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమా న్యాలు హైదరాబాద్‌ సర్వీసులు నాన్‌ ఏసీకి రూ.1000à°•à°¿ పైగా వసూలు చేస్తుండగా ఏసీ సర్వీసులు రూ.1600లకు పై మాటే. ఇక బెంగళూరు సాధారణ సర్వీసులకు రూ.1750 తీసుకుం టుంటే ఏసీ సర్వీసుకులకు రూ.2500లు వసూలు చేస్తున్నారు. చెన్నైకు కూడా రూ.1500లకు పైమాటే వసూలు చేస్తున్నా రని ప్రయాణికులు వాపోతున్నారు. చివరి నిమిషంలో సర్వీసులు లేకుంటే à°† సమ యంలో మరింత పెరగవచ్చని ముందుగానే బుక్‌ చేసుకోండంటూ సలహాలిస్తున్నారు.