రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

Published: Tuesday September 24, 2019
పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సమీక్ష విషయంలో ఇప్పటికే జగన్ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 63ను జారీ చేసింది. à°ˆ విషయంపై మంగళవారం నాడు విచారించిన హైకోర్టు జీవోను కొట్టేసింది. అంతేకాదు.. పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టిపారేసింది.
 
ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో à°ˆ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి, పీపీఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో విద్యుత్‌ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తమ నుంచి పవన, సౌర విద్యుత్‌ కొనుగోలును నిలిపేసిందని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ‘విద్యుత్‌ కొనుగోలు నిలిపివేయడమే కాదు.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలూ చెల్లించడం లేదు. దీనివల్ల పవన విద్యుదుత్పత్తిదారులకు రోజుకు రూ.12కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఉత్పత్తి పూర్తిగా నిలిపేయాలని ప్రభుత్వం అడుగుతోంది. à°† మేరకు వారు టెలిఫోన్‌ ద్వారా ఆదేశించారు. ఇప్పటి వరకూ ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు పంపలేదు. ఇది విద్యుత్‌ చట్టాల ఉల్లంఘనే. బకాయిలు చెల్లించేలా ట్రాన్స్‌కోను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. రూ.వేలకోట్ల రుణాలు తెచ్చుకుని ప్రాజెక్టులు పెట్టారు. బ్యాంకులకు రుణాలు చెల్లించాలి. అలా చెల్లించని పక్షంలో à°† ప్రాజెక్టులు నిరర్ధకంగా మిగిలిపోతాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుదుత్పత్తి సంస్థలు రోడ్డున పడతాయి. ఆర్థికపరమైన సమస్యలున్నందున ఒప్పందం నుంచి ఉత్పత్తి సంస్థలు తమకు తాముగా తొలగాలని రాష్ట్రప్రభుత్వం నిర్బంధం చేస్తోంది..
 
 
పీపీఏలను రద్దు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా తోచినప్పుడల్లా ఒప్పందాన్ని రద్దు చేయాలనడం చట్టాల ఉల్లంఘనే. ఇది మాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గతంలో ఎన్నడూ ఇలా విద్యుత్‌ కొనుగోళ్లను నిలిపేయలేదు. దీనివల్ల ప్రాజెక్టులు నిలిచిపోతాయి. à°† యంత్రాలు నిరంతరాయంగా నడవాలి. నిలిచిపోతే పూర్తిగా నష్టపోతాం. న్యాయం చేయండి. జీవో 63ను రద్దు చేసి, బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వండి’ అని అభ్యర్థించారు