ప్రభుత్వ మతలబుపై విస్తృత చర్చ

Published: Sunday September 29, 2019
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే గ్రానైట్‌ రాజకీయం కొత్తమలుపు తిరిగింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు పాలిషింగ్‌ యజమానుల సమావేశానికి హాజరుకావడం, అదే సమయంలో క్వారీలపై అధికారుల దాడులు ముమ్మరంగా సాగడం అందుకు కారణమైంది. గ్రానైట్‌ క్వారీలలో ఉత్పత్తి పడిపోయి తదనుగుణంగా ఫ్యాక్టరీలపై à°† ప్రభావం పడటం, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న నేపథ్యంలో కార్వీ యజమానుల అంశాన్ని పక్కనపెట్టి పాలిషింగ్‌ యూనిట్ల యజమానులతో పాలకులు భేటీకావడం చర్చనీయాంశమైంది. అటు క్వారీ యజమానులు, ఇటు ఫ్యాక్టరీల యజమానులు ఇద్దరూ పాలకుల చుట్టూ పదేపదే తిరగ్గా పాలిషింగ్‌ యూనిట్ల యజమానుల పట్ల మాత్రమే పాలకులు కరుణచూపడంలో à°—à°² ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకమైంది.
 
రాష్ట్రంలో జగన్‌ సారధ్యంలో వెసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే జిల్లాలో గ్రానైట్‌ క్వారీలపై అధికారులు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. à°—à°¤ రెండున్నర నెలల నుంచి దాడులు జరుగుతున్నాయి. తొలుత చీమకుర్తిలోని గెలాక్సీ కార్వీలలో అణువణువు పరిశీలించిన అధికారులు à°† క్వారీ యజమానులలో కొందరు నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలలో తనిఖీలు నిర్వహించారు. తదనంతరం తనిఖీలను బల్లికురవలోని గ్రానైట్‌ క్వారీలలో ప్రారంభించారు. కారణం ఏదైనా కొన్ని క్వారీలలో అధికారులు à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండు, మూడుసార్లు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఎగుమతికి వెళ్లే గ్రానైట్‌ ముడి సరుకు రవాణాలో జరుగుతున్న లోపాలపై కూడా అధికారులు దృష్టిసారించారు. ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించారు. దీంతో క్వారీలలో ఉత్పత్తి పడిపోయి పాలిషింగ్‌ యూనిట్లకు సరఫరా కావాల్సి à°¨ ముడిసరుకు తగ్గిపోయింది. అప్పటికే సమస్యలతో ఉన్న పాలిషింగ్‌ యూనిట్లు మరింత కష్టాలలోకి నెట్టబడ్డాయి.
 
 
ఇటు గ్రానైట్‌ క్వారీల యజమానుల నుంచి, అటు పాలిషింగ్‌ యూనిట్ల యజమానుల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇరువైపుల నుంచి వారి వారి అసోసియేషన్ల తరపున పలువురు పాలక పెద్దలను కలిశారు. క్వారీల యజమానుల నాయకులైతే జగన్‌కు సన్నిహితుడైన జిల్లా మంత్రి బాలినేనితోపాటు సంబంధిత గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను పలుమార్లు కలిశారు. అంతేకాక గెలాక్సీ గ్రానైట్‌ యజమానులు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబును కలిశారు. అసోసియేషన్‌ తరుపున కొందరు ముఖ్య క్వారీల యజమానులు విజయవాడలో కూడా ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. చివరకు వారు సీఎంకు సన్నిహితుడైన మైనింగ్‌ మంత్రి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్‌రెడ్డిని కలిసి ఆయన ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే à°ˆ వ్యవహారం మొత్తం సీఎం జగన్‌ స్వయంగా చూస్తున్నాడని, ప్రస్తుతానికి తామేమీ చేయలేమన్న సమాధానం అందరి నుంచి వచ్చింది. ఇదే సమయంలో మరోవైపు పాలిషింగ్‌ ఫ్యాక్టరీల యజమానులు కూడా ముఖ్యమైన, ప్రభావితం చూపగల పెద్దలందరి చుట్టూ తిరిగారు.
 
దీంతో గ్రానైట్‌ ఉత్పత్తిలో క్వారీల యజమానులను పక్కన పెట్టి పాలిషింగ్‌ యూనిట్ల యజమానులతో సమావేశం కావటం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం వీలు కుదుర్చుకొని à°† మేరకు ముందుకుపోవాలని జిల్లా పాలక పెద్దలకు సూచన చేసిందా లేక మరేమైనా కారణముందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్‌ క్వారీ నిర్వాహకులలో ఒకరైన మాజీమంత్రి, టీడీపీ నేత శిద్దా రాఘవరావుతోపాటు మరో ఒకరిద్దరు టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసినట్లు తొలుత వినవచ్చింది. అయితే దీంతో వైసీపీలో కీలకంగా ఉన్న కొందరు క్వారీల యజమానులు కూడా భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా మంత్రులు బాలినేని, రామచంద్ర రెడ్డి ఇతర నాయకుల చుట్టూ à°Žà°‚à°¤ తిరిగినా వారి నుంచి à°ˆ వ్యవహారమంతా సీఎం జగన్‌ పర్యవేక్షణలో జరుగుతుందన్న సమాచారం వచ్చింది. అయితే ప్రస్తుతం క్వారీ యజమానుల మాటలను పక్కనపెట్టి ఫ్యాక్టరీ యజమానులకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది.
 
అధికసంఖ్యలో క్వారీ యజమానుల ఉన్నందున వారిని దూరం చేసుకోకూడదని ప్రభుత్వ భావించిందా లేక మొత్తం పరిశ్రమ మూలనపడితే వేలాది కుటుంబాలు రోడ్డునపడి చెడ్దపేరు వస్తుందా లేదా రహస్య ఒప్పందాలు అమలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అయితే ఆ విషయంలో జిల్లా మంత్రి, సంబంధిత మంత్రి జోక్యానికి కూడా ముఖ్యమంత్రి అనుమతించలేదంటే అసలు రహస్యమేమిటనేది చర్చనీయాంశమైంది.