బోటు వెలికితీతపై చేతులెత్తేసిన నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, మెరైన్‌ విభాగాలు

Published: Sunday September 29, 2019
గోదావరిలో మునిగిన బోటు జాడను గుర్తించడం తమ వల్ల కాదని నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, మెరైన్‌ విభాగాలు ఎట్టకేలకు చేతులెత్తేశాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 14 రోజులుగా బోటును వెలికి తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి కొలిక్కి రాలేదు. విశాఖ నేవీ నీటి కెమెరాలు, ఉత్తరాఖండ్‌ సైడ్‌ స్కాన్‌ సోనార్‌.. ఇతరత్రా అత్యాధునిక యంత్రాలు, పరికరాలు వినియోగించినా గోదావరిలో ఎర్రనీరు కారణంగా బోటు జాడను గుర్తించడం సాధ్య పడలేదు. à°ˆ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. దీంతో ఇక బోటును బయటకు తీసుకువచ్చే బాధ్యతను కాకినాడకు చెందిన దర్మాడి సత్యం కంపెనీకి కట్టబెడుతూ కలెక్టర్‌ శనివారం ఆదేశాలు ఇచ్చారు. ఇందుకుగాను సత్యానికి చెందిన బాలాజీ మెరైన్స్‌ కంపెనీకి ఖర్చుల à°•à°¿à°‚à°¦ రూ.22.70 లక్షలు చెల్లించనున్నారు. మరో కంపెనీ ముందుకు వచ్చినా అనుభవం లేదని తిరస్కరించారు. ఈనెల 15à°¨ పాపికొండల విహారానికి 77 మందితో బయలుదేరిన రాయల్‌ వశిష్ట బోటు దేవీపట్నం మండలం కచలూరు గ్రామం వద్ద నీట మునిగింది. à°ˆ ఘటనలో 36 మంది మృతి చెందగా, ఇంకా 15 మంది జాడ తెలియలేదు. బోటు గోదావరిలో 315 వందల అడుగుల లోతులో పడిపోయింది. దీన్ని బయటకు తీయడానికి అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేపట్టారు.
 
తొలుత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, à°—à°œ ఈతగాళ్లను రప్పించి నదిలోకి దించారు. గోదావరి వరద ఉధృత ప్రవాహం, అడుగున సుడిగుండాల కారణంగా బోటు జాడ చిక్కలేదు. విశాఖ నేవీ నుంచి ప్రత్యేక నిపుణులు, నీటి అడుగున శోధించే యంత్రాలు, కెమెరాలను తీసుకువచ్చి గాలించారు. కానీ ఇవీ పనిచేయలేదు. కాకినాడకు చెందిన à°—à°œ ఈత నిపుణుడు ధర్మాడి సత్యాన్ని తీసుకురాగా, ఆయన తన 24 మంది బృందంతో రెండు రోజులు గాలించారు. కానీ వరద ఉధృతితో à°† బృందం కూడా చేతులెత్తేసింది. ఉత్తరాఖండ్‌ నుంచి నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తించే సైడ్‌స్కాన్‌ సోనార్‌ను రప్పించారు. ఇది కూడా ఆశించిన రీతిలో పనిచేయలేదు. ముంబై నుంచి మెరైన్‌ నిపుణులను చివరి ప్రయత్నంగా తీసుకురాగా, ఎర్రనీరు, బురద, సుడిగుండాల కారణంగా నీటిలో కనీసం రెండు ఇంచులు కూడా కిందకు ఏమీ కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో బోటు జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. ఇప్పటికి సంఘటన జరిగి 14 రోజులు అవుతుండగా ప్రతిరోజూ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విసుగులేకుండా అన్వేషణ కొనసాగించాయి. కానీ ఫలితం దక్కలేదు. à°ˆ నేపథ్యంలో ప్రభుత్వం తరపున బోటు వెలికితీత ప్రయత్నాలకు తాజాగా బ్రేక్‌పడింది. ఇక బోటు బయటకు రావడం కష్టం అని నిపుణులు తేల్చేశారు.