మూడు వాహనాలపై మలయప్ప విహారం

Published: Sunday October 06, 2019
 à°¤à°¿à°°à±à°®à°² బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శనివారం శ్రీవారు ముచ్చటగా మూడు వాహనాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం హనుమంత వాహనంలో కోదండరాముడిగా, రాత్రి à°—à°œ వాహనంపై రాజాధిరాజుగా తిరువీధుల్లో విహరించిన తిరుమలేశుడు సాయంత్రం స్వర్ణరథంపై కటివరద హస్తాలతో, ఉభయ దేవేరులతో కూడి దర్శనమిచ్చాడు. ఉదయం పూజాదికాల అనంతరం మలయప్ప హనుమంతునిపై ఆశీనులై శ్రీరామచంద్రమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వర్ణరథంలో మలయప్ప తన సహజ అవతారంలో ఉభయ దేవేరులతో కలసి విహరించారు. శనివారం రాత్రి విశేషాలంకృతుడై పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా గజేంద్రుని వాహనంగా చేసుకుని ఊరేగుతూ భక్తులను దీవించారు.
 
 
హనుమంత వాహనసేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభా్‌షరెడ్డి, హైకోర్టు సీజే ప్రవీణ్‌కుమార్‌ పాల్గొనగా రాత్రి గజవాహన సేవలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కాగా, శ్రీవారి దర్శనార్థం దేశం నలువైపుల నుంచి భక్తజనం పోటెత్తడంతో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి. పెరటాసి మూడో శనివారం, దసరా సెలవులు, వారాంతం, ఆపైన బ్రహ్మోత్సవాలు.. అన్నీ కలిసి రావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు తరలివచ్చారు. దీంతో క్యూకాంప్లెక్సులు నిండి క్యూలైను 3 కిలోమీటర్ల వరకు విస్తరించింది. స్వామి దర్శనానికి దాదాపు 20 గంటలు పట్టింది. శనివారం అర్థరాత్రి ఏకాంతసేవ వరకు మహాలఘు దర్శనంలో దాదాపు 95 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం నుంచి స్లాటెడ్‌ దివ్వ, సర్వదర్శనం టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నారు.