ఓ ద్విచక్రవాహనానికి పెండింగ్‌లో 73 చలాన్‌లు

Published: Sunday October 06, 2019

à°“ ద్విచక్రవాహనానికి 73 చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. à°† వాహనదారుడిని వాహనంతోసహా చిక్కడపల్లి ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం సొమ్మును మీ సేవలో కట్టించారు. చిక్కడపల్లి ట్రాఫిక్‌ సీఐ à°Žà°‚.ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. .జూపార్క్‌ వద్ద నివసించే ఖాజా ఖాన్‌ సికింద్రాబాద్‌లో గా్ల్‌స్‌ వర్క్‌ చేస్తుంటాడు. ఆయన ద్విచక్ర వాహనానం(టీఎస్‌ 12 ఇఇ 8895)పై చాలా కాలంగా 73 (10వేల55 రూపాయలు) చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కవాడిగూడలో శనివారం చెకింగ్‌ చేయగా ఖాజాఖాన్‌ వాహనంపై పెద్ద మొత్తంలో చలానాలు ఉన్నట్లు గుర్తించారు. à°† మొత్తాన్ని సమీపంలోని మీసేవలో చెల్లింపజేశారు. ఎస్‌ఐ బాల్‌రాజ్‌, హోంగార్డ్‌ కిరణ్‌లను ట్రాఫిక్‌ ఏసీపీ విద్యాసాగర్‌, సీఐ ప్రభాకర్‌రెడ్డి అభినందించారు.