దేవదాయ అధికారుల లంచావతారం

Published: Monday October 07, 2019
ప్రభుత్వం మారినా.. పారదర్శకతకు పెద్దపీట అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా దేవదాయ శాఖలో అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఇవ్వాల్సింది ఇచ్చుకోవాల్సిందేనని.. అందులో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టంచేస్తున్నారు. చివరికి సొంత శాఖ ఉద్యోగుల విషయంలోనే ముడుపుల కోసం వేధింపులకు దిగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ ప్రతి ఫైలుకూ బేరాలు పెడుతున్నారు. పీఆర్‌సీ, డీఏ, బదిలీ.. ప్రతిదానికీ à°“ రేటు కట్టి.. వసూలు చేసుకుంటున్నారు. ఇవ్వనివారి ఫైళ్లు మాయం చేసేస్తున్నారు. కమిషనరేట్‌ అధికారులు, ఉద్యోగుల తీరుపై విసిగిపోయిన కొందరు ఆలయ ఉద్యోగులు వారిపై ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఒకట్రెండు రోజుల్లో ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా వినుకొండలో పనిచేస్తున్న à°“ ఆలయ ఉద్యోగి 2015లో పీఆర్‌సీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది ఉన్నతాధికారులకు చేరేందుకు కమిషనరేట్‌లోని ‘సి’ సెక్షన్‌లో à°“ ఉద్యోగికి, మరో సెక్షన్‌లో à°“ అధికారికి కలిపి రూ.25 వేలు ముడుపులుగా ఇచ్చాడు. చివరకు à°† ఫైలుకు ఉన్నతాధికారుల ఆమోదం లభించినా.. అది ఇప్పటికీ సదరు ఉద్యోగికి చేరలేదు. తన నుంచి ఇంకా ఏదో ఆశిస్తూ తనకు పీఆర్‌సీ ఇచ్చే ఆదేశం జారీ చేయడం లేదని, ఏం చేయాలో అర్థం కావడం లేదని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన మరో ఆలయ ఉద్యోగి 1995 నుంచి రికార్డు అసిస్టెంట్‌à°—à°¾ పనిచేస్తున్నాడు. జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌ కోసం దరఖాస్తు చేసుకుని.. ఏడాది కాలం నుంచి తిరుగుతున్నా అధికారులు దానిని పట్టించుకోలేదు. తమను ప్రత్యేకంగా కలవాలని చేసిన సూచనలను à°† చిరుద్యోగి పట్టించుకోకపోవడంతో కొంతకాలం తర్వాత ఫైలు కనిపించకుండా పోయింది. ఇప్పుడు అడిగితే ఏ ఫైలు అని కమిషనరేట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారని à°† ఉద్యోగి వాపోయాడు. అలాగే ఏడు నెలల à°•à°¿à°‚à°¦ à°“ ఉద్యోగి డిప్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. à°† ఫైలును పక్కనపెట్టిన అధికారులు అదే ప్రాంతానికి చెందిన ఉద్యోగుల డిప్యుటేషన్‌ ఫైళ్లను మాత్రం కేవలం 13 రోజుల్లోనే క్లియర్‌ చేశారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగికి ప్రస్తుత ఆలయ ఈవో, డిప్యుటేషన్‌పై వెళ్లాలనుకున్న ఆలయానికి సంబంధించిన ఈవో ఇద్దరూ అంగీకారం తెలిపారు. అయినా మళ్లీ పరిశీలించాలని అధికారులు ఫైలును వెనక్కి పంపారు.