పోలవరం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

Published: Monday October 07, 2019
 à°ªà±‹à°²à°µà°°à°‚ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందా..? ప్రధానంగా భూసేకరణ.. సహాయ పునరావాసానికి సొమ్ములిస్తుందా.. అనే సందేహాలు రానురాను అధికమవుతున్నాయి. à°—à°¤ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేవనెత్తిన కొర్రీలనే కొత్తగా లేవనెత్తడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన డబ్బును తిరిగి చెల్లించేందుకు కూడా పాత మెలికలే పెడుతోంది. అంచనా వ్యయం పెరుగుతుందని.. ప్రాజెక్టు పూర్తికి విపరీతంగా జాప్యం జరుగుతుందని చెప్పినా జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండర్లకు వెళ్లడం.. à°ˆ వ్యవహారం హైకోర్టుకు చేరడం.. పనులు నిలిచిపోవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడేవరకు ఎదురుచూడడం మంచిదన్న ఉద్దేశంతో కేంద్ర జలశక్తి శాఖ ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. పోలవరం పనుల కోసం రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.5,103 కోట్లు వ్యయం చేసింది. ఇందులో 2014 ఏప్రిల్‌ తర్వాత ఖర్చుచేసిన రూ.3,500 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అయితే 2014à°•à°¿ ముందు à°ˆ ప్రాజెక్టుపై చేసిన ఖర్చుల తాలూకు ఆడిట్‌ నివేదిక సమర్పించాలని నిరుడే స్పష్టం చేసింది. దానికి సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ పంపిన సమాధానాలపై సంతృప్తి చెందినట్లు కనిపించింది. కానీ నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆడిట్‌ నివేదిక అడిగింది. దానిని సమర్పిస్తేనే నిధులిస్తామని స్పష్టం చేస్తోంది.
 
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పునరావాస కుటుంబాల సంఖ్య, భూ సేకరణ, పరిహార వ్యయాలపై జలశక్తి శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి.. à°ˆ ఏడాది ఫిబ్రవరిలో 2016-17 ధరల మేరకు ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,848 కోట్లకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం సమ్మతి తెలిపింది. జల సంఘం à°ˆ మేరకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నిర్వహించి.. తుది అంచనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిని కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. అక్కడ పరిశీలనలో ఉన్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగడం.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడడం à°šà°•à°šà°•à°¾ జరిగిపోయాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జగన్‌.. ఎన్నికలకు ముందే పోలవరం ప్రాజెక్టు వ్యయంపై పలు ఆరోపణలు చేశారు. టెండర్లలో అక్రమాలు జరిగాయన్నారు. 2014 నుంచి 2019 వరకూ à°ˆ ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించారు. దాని సిఫారసుల మేరకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లారు. రివర్స్‌ టెండర్లు వద్దని కేంద్రం సూచించినా ఆయన ముందుకే వెళ్లారు. పోలవరం జల విద్యుత్కేంద్రం, సాగు నీటి ప్రాజెక్టులను కలిపి ఒకే ప్యాకేజీ à°•à°¿à°‚à°¦ రివర్స్‌ టెండర్లు పిలిస్తే మేఘా ఇన్‌ఫ్రా ఒక్కటే పాల్గొంది.