ఐదు నిమిషాలకే ప్లాస్లిక్‌గా మారిన పాలు

Published: Friday October 11, 2019
ఆరోగ్యం బాగుండాలంటే.. నిత్యం పాలు తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. కానీ à°† పాలే ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి ఎదురైతే... ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా.. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. అక్రమ సంపాదన కోసం కొందరు యథేచ్చగా పాలను కల్తీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో తాగడం కోసం వేడి చేసిన పాలు.. ఏకంగా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది. ప్రగతినగర్‌లో à°“ కుటుంబానికి ఎదురైన à°ˆ అనుభవం.. నగరంలో విక్రయిస్తున్న పాల స్వచ్ఛతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
 
స్థానిక చౌరస్తాలో ఉండే సాయి తేజ మిల్క్‌ సెంటర్‌లో రోజూలాగే రెండు మిల్క్‌ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి గిన్నెలో à°“ ప్యాకెట్‌ పాలు పోసి స్టౌపై పెట్టాడు. ఐదు నిమిషాలు గడిచాయో లేదో.. పాలు కాస్తా.. ప్లాస్టిక్‌à°—à°¾ మారిపోయాయి. కంగారుపడిన పవన్‌.. గిన్నెలోనే ఫాల్ట్ ఉండొచ్చని.. మరో పాల ప్యాకెట్‌ను ఓపెన్‌ చేసి వేరే గిన్నెలో వేడి చేశాడు. ఈసారి కూడా అదే పరిస్థితి. యథావిథిగా అవి కూడా ప్లాస్టిక్‌ రూపంలోకి మారిపోయాయి. ఇదే విషయమై మిల్క్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే.. అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. చేసేది లేక పవన్ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.
 
à°ˆ అనుభవం ఒక్క పవన్‌దే కాదు.. నిత్యం వందలాది ఇళ్లలో జరగుతోంది. అయితే తమ వద్దే ఏదో తప్పు జరిగి ఉంటుందని చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు. కానీ మొదట్లోనే అసలు మోసం జరుగుతోంది. కల్తీ పాల నిరోధానికి à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని ఇటీవలే సీఎం కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో ప్రకటించారు. కానీ కల్తీ రాయుళ్లలో ఏమాత్రం మార్పు రాలేదు. తమను కాదులే అన్నట్టుగా పని కానిచ్చేస్తున్నారు.
 
కల్తీ పాలతో అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. కేన్సర్ వంటివి సోకి క్రమంగా ప్రాణాలే పోవచ్చు. అధిక రక్తపోటు, గుండె సంబంధవ్యాధులూ రావచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. మొదడు, కాలేయం, మూత్రపిండాలపై కూడా కల్తీ పాల ప్రభావం ఉంటుంది. ఫిట్స్‌ వచ్చే అవకాశాలుంటాయి. కండరాల్లో వణుకు కూడా రావొచ్చు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు ప్రాణాలకు ముప్పు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
కల్తీ పాలను చిన్న చిట్కాతో సులభంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెడికల్‌ షాపుల్లో దొరికే టింక్చర్‌ అయోడిన్‌ను తీసుకొని.. పాలల్లో వేస్తే కల్తీవో కావో తెలుస్తుందని అంటున్నారు. అయోడిన్‌ వేశాకా పాలు పసుపు రంగులోకి మారితే అవి మంచి పాల à°•à°¿à°‚à°¦ లెక్క. à°’à°• వేళ అవి నీలం రంగులోకి మారితే మాత్రం అవి కల్తీ పాలేనని అంటున్నారు. ఏమైనా పసిపిల్లల నుంచి పండుముదుసలి వరకు నిత్యవసరంగా మారిన పాలలోనూ కల్తీ జరగడం.. తీవ్రంగా పరిగణించాల్సి విషయం. ఇలాంటి కల్తీలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.