ఆంధ్రప్రదేశ్‌లో నదులన్నీకలుషితమవుతున్నాయ్

Published: Sunday October 13, 2019
ఆంధ్రప్రదేశ్‌లో నదులన్నీ కలుషితమవుతున్నాయని, వాటిని సంవరక్షించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హరిద్వార్‌లో పర్యటిస్తున్న ఆయన à°—à°‚à°—à°¾ కాలుష్యంపై జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నదులను సంవరక్షించాలని అందుకు గంగానదితో శ్రీకారం చుట్టాలని అన్నారు. మోదీ ప్రభుత్వం à°—à°‚à°—à°¾ ప్రక్షాళన చేస్తుందని ఆశించానని, అయితే వాళ్లు à°† విధంగా పని చేయలేకపోయారని అన్నారు.
 
హరిద్వార్‌లో పవన్ à°—à°‚à°—à°¾ హారతిలో పాల్గొన్నారు. తర్వాత గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన జీడీ ఆగర్వాల్ ప్రథమ వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత అక్కడి ఆశ్రమవాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నదుల కలుషితంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పవన్.. భారత దేశంలోని నదులన్నీ కలుషితం అయిపోయాయని అన్నారు. ఏ అభివృద్ధి అయినా పర్యావరణ సమతుల్యతపై ఆధారపడే జరగాలని, ప్రాథమిక దశలోనే పర్యావరణ సమతూల్యత కోసం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీలోని విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చబోతోందని, నీటి బొట్టుకూడా లభ్యమయ్యే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని నదులను పునరుజ్జీవింపచేస్తేనే ప్రజల దాహార్తి నుంచి గట్టెక్కించగలమని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు