సైబర్‌ నేరగాళ్లు కాజేస్తే బ్యాంకులదే బాధ్యత

Published: Thursday October 17, 2019
సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఒక్కో సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో నెలకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు స్కీమ్‌లతో అమాయకులు, అత్యాశపరులను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ కేటుగాళ్లు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. కస్టమర్‌ ప్రమేయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా అతడి బ్యాంక్‌ ఖాతాలోని డబ్బును సైబర్‌ నేరగాళ్లు కాజేస్తే అందుకు పూర్తి బాధ్యత బ్యాంక్‌ వహించాల్సిందేనని మీకు తెలుసా? à°† డబ్బును బ్యాంక్‌ కచ్చితంగా రిఫండ్‌ చేయాల్సిందే. కస్టమర్ల ఖాతాలో ఉన్న డబ్బుకు బ్యాంక్‌లు రక్షణ కల్పించాలి. ఖాతా నుంచి డబ్బు అతడి ప్రమేయం లేకుండా మాయమైతే రిఫండ్‌ చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు.
 
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నివసిస్తున్న వెంకటే్‌షకు à°“ ప్రైవేట్‌ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. అతడికి ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో రూ. 6 వేలు నిల్వ ఉంది. మొదటి నెల జీతం రూ. 35 వేలు బ్యాంక్‌ ఖాతాలో జమ అయింది. డబ్బు జమ అయిన à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే ఖాతాలోని రూ. 40 వేలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అధికారులు మెసేజ్‌లను పరిశీలించగా.. గుర్గావ్‌లోని ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా అయినట్లు నిర్ధారణ అయింది. తామేమీ చేయలేమని బ్యాంక్‌ అధికారులు చెప్పారు. ఏదో à°’à°• సందర్భంలో మీరు సైబర్‌ నేరగాళ్లకు పాస్‌వర్డ్‌ చెప్పడం, లేదా షేర్‌ చేసి ఉంటారని అన్నారు. డెబిట్‌ కార్డు నా వద్దే ఉందని, జీతం కొన్ని గంటలముందే ఖాతాలో జమ అయిందని, డెబిట్‌ కార్డు ఎవరికీ ఇవ్వలేదని బాధితుడు చెప్పినా వారు పట్టించుకోలేదు.
 
సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సలహా ఇవ్వగా వెంకటేష్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు సైబర్‌ నేరగాళ్లు స్కిమ్మింగ్‌ ద్వారా వెంకటేష్‌ డెబిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసి డబ్బులు కాజేశారని గుర్తించారు. కేసు నమోదు చేసి రసీదు ఇచ్చారు. మీ ప్రమేయం లేకుండా ఖాతాలో డబ్బు మాయమైంది కాబట్టి బ్యాంక్‌ రిఫండ్‌ చేయాలన్నారు. బ్యాంక్‌ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయమని చెప్పారు. బాధితుడు ఉన్నతాధికారులను కలిసి డబ్బు రిఫండ్‌ చేయాలని దరఖాస్తు రాసిచ్చాడు. అన్ని రకాలుగా విచారణ చేసిన బ్యాంక్‌ అధికారులు వెంకటేష్‌ ఐడీ ప్రూఫ్‌ తీసుకొన్నారు. సుమారు నాలుగు నెలలపాటు ఇంటర్నల్‌à°—à°¾ విచారణ చేసుకొని తర్వాత రూ. 40 వేలు తిరిగి అతడి ఖాతాలో జమచేశారు.