పోలవరం కొత్త అంచనా ఆమోదించాలి

Published: Wednesday October 23, 2019
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరారు. వెనుబడిన ప్రాంతాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, ఇతర అనేక అంశాలపై ఆయన à°’à°• వినతిపత్రం సమర్పించారు. సోమవారమంతా వేచి చూసినప్పటికీ జగన్‌కు అమిత్‌à°·à°¾ అప్పాయింట్‌మెంట్‌ లభించని సంగతి తెలిసిందే. చివరికి... మంగళవారం ఉదయం 11 గంటలకు అప్పాయింట్‌మెంట్‌ లభించింది. అమిత్‌à°·à°¾ జన్మదినం కావడంతో జగన్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర సమస్యలపై కొద్దిసేపు చర్చించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపుతోందని, హోదాయే వీటికి పరిష్కారమని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్‌ హామీలను, సమస్యలను పరిష్కరించాలని కోరారు.
 
2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని అమిత్‌షాను జగన్‌ కోరారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి, రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1050 కోట్లు తక్షణమే ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాను కోరారు. అలాగే... రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిన రూ.5,073కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
à°ˆ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి రూ.16వేల కోట్లు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. మరోవైపు... పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా రూ.838కోట్ల ప్రజాఽధనాన్ని ఆదా చేశామని పేర్కొన్నారు. గోదావరి జలాలను కృష్ణా పరిధిలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలానికి తరలించే కొత్త ప్రాజెక్టు గురించి కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు. ‘‘కృష్ణా నదిలో à°—à°¡à°¿à°šà°¿à°¨ 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు గోదావరిలో à°—à°¡à°¿à°šà°¿à°¨ 30 సంవత్సరాలుగా సగటున 2780 టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయి. కృష్ణా జలాలపై ఆధారపడిన రాయలసీమ, కృష్ణా డెల్టాతోపాటు తాగు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను మళ్లించే కొత్త ప్రాజెక్టును చేపట్టాలి. దీనిపై సంబంధిత శాఖలను ఆదేశించాలి’’ అని అమిత్‌ షాను కోరారు.