కుండపోత వర్షం కన్నీరు మిగిల్చింది.

Published: Sunday October 27, 2019
 à°°à±ˆà°¤à±à°²à± ఏడాది అంతా కష్టపడిన శ్రమ కనురెప్పపాటులో మాయమైంది. రెండు రోజుల పాటు ఏకదాటిన కురిసిన కుండపోత వర్షం కన్నీరు మిగిల్చింది. వర్షంతో పొట్టదశలో ఉన్న వరికి ఉరి పడింది. రేపో.. మాపో కోతకు వస్తుందనుకున్న దశలో నేలపై తలవాల్చింది. వరితోపాటు మొక్కజొన్న, కూరగాయ పంటలు నీట మునిగాయి. వర్షానికి చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. నీరు వృధాగా పోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. శీతానగరం సమీపంలోని సువర్ణముఖి నదిపై ఉన్న వంతెన కుంగిపోయింది. వంతెనపై నుంచి ప్రయాణాలు నిలిపివేశారు.
 
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. పంటలు నీటమునిగాయి. చెరువులు, కాలువలకు గండ్లుపడినా.. మరమ్మత్తుపనులు ప్రారంభించలేదు. అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఎవరూ స్పందించడంలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.