బిల్లు ట్రాక్టరుకు.. లోడింగు లారీలకు

Published: Tuesday October 29, 2019
ఇసుక కొరత తీర్చటానికి ఏపీ మినరల్‌ డెవల్‌పమెంటు కార్పొరేషన్‌ కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. పదిరోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలోని ఎల్‌అండ్‌à°Ÿà±€ కంపెనీ నిల్వ చేసిన 81 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకొని ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించింది. అయితే, ఎల్‌అండ్‌à°Ÿà±€ కంపెనీ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, లోడింగ్‌ ఆపాలని కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ఏపీఎండీసీ.. నెక్కల్లు ఎన్‌సీసీ కంపెనీలో ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకొంది. à°—à°¤ నాలుగు రోజుల నుండి ఇక్కడి ఇసుకను లోడింగ్‌ చేస్తోంది. అయితే, à°ˆ స్టాక్‌ పాయింట్‌ నిర్వహణ తీరుపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆరా తీయడానికి ఆదివారం అక్కడికి వెళ్లిన విలేకరులకు స్టాక్‌ పాయింట్‌ వద్ద అంతా ప్రైవేటు వ్యక్తులే కనిపించారు.
 
వారిలో అధికార పార్టీ వ్యక్తులు ఉన్నట్టు విలేకరులు గుర్తించారు. అక్కడ ఎక్కడా ఎపీఎండీసీ తాలూకూ అధికారులే కనిపించలేదు. లోడింగ్‌ కోసం నిలిపి ఉంచిన వాహనాల్లో ఎక్కువగా ఇతర జిల్లాలవే కనిపించాయి. ఇసుక ఆన్‌లైన్‌లో తమకు అందటం లేదని ఇప్పటికే స్థానికులు వాపోతున్నారు. ఓపెన్‌ చేసిన ఐదు నిమిషాలకే ఆన్‌లైన్‌లో పెట్టిన ఇసుక బుకింగ్‌ అయిపోతోందని చెబుతున్నారు. నెక్కల్లు ఎన్‌సీసీ స్టాక్‌ పాయింట్‌లోనే ఏదో గడబిడ ఉందని అనుమానిస్తున్నారు. ట్రాక్టర్‌ లోడింగ్‌కు బుక్‌ చేసుకొని, à°† బిల్లుతో స్టాక్‌ పాయింట్‌ వద్ద లారీకి ఇసుక ఎత్తుకొంటున్న వైనం విలేకరులు గమనించారు. దీనిపై వివరాలకు ప్రయత్నించగా, విలేకరుల పట్ల అక్కడి స్టాక్‌ పాయింటు నిర్వాహకులు దురుసుగా వ్యవహరించారు. వారిని భయపెట్టడానికి ప్రయత్నించారు. అక్కడకు పోలీసులను పిలిపించారు. విలేకరులను పోలీసులు తమ వెంట తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విలేకరులను తీసుకెళ్లారని తెలుసుకొని.. పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు స్టేషన్‌ వద్దకు చేరుకొన్నారు. వాస్తవానికి, స్టాక్‌ పాయింట్‌ దగ్గర తమ దృష్టికి వచ్చిన విషయాలను, తమతో అక్కడివారు దురుసుగా ప్రవర్తించిన సంగతిని విలేకరులు అంతకుముందే సీఐకి ఫోన్‌ చేసి చెప్పారు. అయినప్పటికీ పోలీస్‌ స్టేషన్‌కు విలేకరులను బలవంతంగా తీసుకెళ్లి, కొద్దిసేపు కూర్చోబెట్టి à°† తరువాత పంపించి వేశారు.