ఇంటర్‌ వరకు ఉచిత, నిర్బంధ విద్య .. సీఎంకు కమిటీ నివేదిక

Published: Wednesday October 30, 2019
విద్యార్థుల్లో అభ్యసన అంతరాన్ని తగ్గించేందుకు, రాత, పఠనా సామర్థ్యాలను పెంచేందుకు ‘అక్షర యజ్ఞం’ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని విద్యారంగ సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ కీలక సూచన చేసింది. ప్రతి పంచాయతీలోనూ పూర్తి సదుపాయాలతో ప్రైమరీ స్కూలును ఏర్పాటు చేయాలని.. ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌ పెట్టాలని, హైస్కూల్‌ స్థాయిలో ఏ విద్యార్థీ మధ్యలోనే చదువు ఆపేయకుండా(డ్రాపౌట్‌) తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన à°ˆ కమిటీ మంగళవారం సచివాలయంలో సీఎం జగన్‌ని కలిసి.. నివేదికను అందించింది. కమిటీ పేర్కొన్న అంశాలు..
 
ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను వెంటనే చక్కదిద్దాలి. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పై భారీగా ఖర్చు చేయాలి. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. అమ్మఒడి, విద్యా నవరత్నాల కార్యక్రమాలు బాగున్నాయి. అయితే, వీటిని అర్హులకు పూర్తిగా అందేలా చూడాలి. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పారదర్శకత లేదు. నియంత్రణ అంతకన్నా లేదు. ప్రైవేట్‌ పాఠశాలల్లో బోధనా సిబ్బంది, పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. పాఠశాల, ఉన్నత విద్యా రంగాలపై నియంత్రణ, పర్యవేక్షణలకు కమిషన్‌లు ఉండాల్సిందే. రాత, పఠనా సామర్థ్యాలను పెంచే విధంగా ప్రచారం చేయాలి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు మధ్యలోనే బడి మానేయకుండా అసె్‌సమెంట్‌ ట్రాకింగ్‌ ఉండాలి. పుస్తకాల మోతను తగ్గించాలి.
 
ఎనిమిదో తరగతి నుంచి వృత్తి విద్య ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నందున.. టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇంటర్మీడియెట్‌ వరకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాలి. అన్ని హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీల వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి. ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్‌ బోర్డులను కలిపి ఒకే కమిషనరేట్‌ పరిధిలోకి తేవాలి. అన్ని స్కూళ్లలోనూ ఎస్‌సీఈఆర్‌à°Ÿà±€ సిలబస్‌ ఉండాలి. గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం à°’à°• మండలిని, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. జాతీయస్థాయిలో ఉన్న ‘నేషనల్‌ అసె్‌సమెంట్‌ అక్రిడిటేషన్‌(నాక్‌)’ మాదిరిగా.. రాష్ట్రస్థాయిలో స్టేట్‌ లెవల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కమిటీ(ఏపీ శాక్‌) ఏర్పాటు చేయాలి.
 
6 నుంచి 16 ఏళ్లలోపు వారికి విద్యను అందించే ఏర్పాటు చేయాలి. విద్యార్థి అభ్యసన ప్రగతి ఏటా 8ు పెరిగేలా చూడాలి. హైస్కూలు స్థాయిలో ఏ విద్యార్థీ మధ్యలోనే స్కూల్‌ మానకుండా పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులు పదో తరగతి వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌఖిక, డిజిటల్‌ సదుపాయాలు ఉండాలి.