రామ మందిర నిర్మాణ బాధ్యత ఎవరిది!

Published: Sunday November 10, 2019
కోర్టు తీర్పు ఇచ్చింది! ఇప్పుడు ఏం జరగనుంది!? అయోధ్యలో రామ మందిర నిర్మాణ బాధ్యత ఎవరిది!? మసీదుకు స్థలం ఎక్కడ ఇస్తారు!? దానిని ఎవరు నిర్మిస్తారు!? సుప్రీం తీర్పు నేపథ్యంలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. మందిరం నిర్మించడానికి మూడు నెలల్లో à°’à°• ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, అయోధ్యలోని 2.77 ఎకరాలను దానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నిర్దేశించింది. భూమి అప్పగింతకు తగిన ప్రణాళికలు రూపొందించే బాధ్యత కేంద్రంపై ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు మందిర నిర్మాణం పూర్తి చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ట్రస్టు ఏర్పాటు, మందిరం నిర్మాణంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో త్వరలో కేంద్రం సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
నిర్మోహీ అఖాడాకు కూడా ట్రస్టు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని కోర్టు స్పష్టం చేసినందున.. ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరపాల్సి ఉంటుంది. తొలుత ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మందిరం నిర్మాణ బాధ్యతపై స్పష్టత వస్తుంది. దానిని హిందూ సంస్థలు నిర్మిస్తాయా లేక ప్రభుత్వం నిర్మిస్తుందా అన్న అంశాలు ఇప్పుడు అప్రస్తుతమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదెకరాల భూమి ని కేటాయించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలానికి చుట్టూ ఉన్న 67 ఎకరాల మిగులు భూమిలో దీనిని కేటాయిస్తారా? మరో ప్రఖ్యాత ప్రదేశంలో కేటాయిస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేసింది. à°ˆ నేపథ్యంలో.. స్థలం అందుబాటు, లభ్యత అంశాలను పరిశీలించిన తర్వాత ముస్లిం సంస్థలు, సున్నీ వక్ఫ్‌ బోర్డుతో సర్కారు చర్చలు జరపనుంది.