వంశీ, గంటా వెళతారా.. ఒకవేళ వెళితే...

Published: Friday November 22, 2019
ఏపీ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి మొదలుకానున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్‌ 9à°¨ బీఏసీ సమావేశం జరగనుంది. ఇసుక కొరత, రాజధాని, పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉండగా, ప్రతిపక్షం ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చేందుకు అధికార వైసీపీ సమాయత్తమవుతోంది. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా, టీడీపీ నేతలపై, కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న తీరుపై కూడా ప్రతిపక్షం నిలదీయాలని భావిస్తోంది.
 
 
ఇదిలా ఉంటే... à°ˆ సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహార శైలిపై అటు వైసీపీలో, ఇటు టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి వంశీ రాజీనామా చేశాక జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ఆయన పోతూపోతూ చంద్రబాబుపై, లోకేశ్‌పై చేసిన విమర్శలపై అసెంబ్లీలో à°°à°—à°¡ నెలకొనడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
 
ఎమ్మెల్యే పదవికి కాకుండా పార్టీకి మాత్రమే రాజీనామా చేసిన వంశీ టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే అవకాశాలు కనిపించడం లేదు. అలా అని.. వైసీపీ సభ్యులతో కలిసి కూర్చోడానికి à°† పార్టీలో ఆయన ఎంట్రీపై క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వంశీ అసలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా.. ఒకవేళ హాజరయితే ఏ అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క మరో టీడీపీ ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు కూడా బీజేపీలో చేరేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. à°ˆ ప్రచారంపై ఆయన ఇంతవరకూ స్పందించని పరిస్థితి. పవన్ లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలపాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించినప్పటికీ à°—à°‚à°Ÿà°¾ వెళ్లలేదని.. అధినేత ఆదేశాలను బేఖాతరు చేసినట్లుగా వార్తలొచ్చాయి. పార్టీ ఇటీవల తలపెట్టిన ఏ నిరసన కార్యక్రమాలకు à°—à°‚à°Ÿà°¾ అందుబాటులో లేకపోవడంతో à°ˆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ à°ˆ సమావేశాలకు హాజరవుతారా లేక గైర్హాజరవుతారా అన్న ఉత్కంఠ నెలకొంది.