ఇప్పుడు జగన్‌ నాలుక తిప్పేశారు

Published: Friday November 22, 2019
 ‘ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా ఆంగ్ల భాష బోధనను విస్తృతం చేయడానికి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఘోరం జరిగిపోతోందని.. మాతృభాషను చంపేస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌, ఆయన మీడియా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు నాలుక తిప్పేసి తెలుగుదేశం పార్టీని తిట్టి పోస్తున్నారు’ అని టీడీపీ ఆక్షేపించింది. ఆంగ్లభాష బోధనను కనుక్కొంది తామేనన్నట్లుగా.. ఆంగ్లభాష బోధనకు టీడీపీ పరమ వ్యతిరేకి అన్నట్లుగా జగన్‌, ఆయన బృందం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో à°† పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. à°ˆ సమావేశంలో ఆంగ్ల భాష బోధనపై జగన్‌ ప్రభుత్వ వైఖరి.. ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శల ప్రస్తావన వచ్చింది. మన సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడానికి తెలుగు భాష కావాలని, వృత్తిలో రాణించడానికి ఇంగ్లిష్‌ అవసరమని... ఇదే టీడీపీ వైఖరని చంద్రబాబు పేర్కొన్నారు. అనుకున్నదే తడవుగా ఆంగ్ల మాధ్యమం పెట్టేస్తామనకుండా à°—à°¤ ఐదేళ్లలో à°ˆ దిశగా టీడీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కొందరు నేతలు గుర్తుచేశారు. ‘2015-16లోనే రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చాం.
 
2018-19 నుంచి మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, ఇతర ప్రైమరీ స్కూళ్లలో తెలుగుతోపాటు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు కూడా నిర్వహించాలని జీవో 78ని 2017లోనే జారీ చేశాం. 2018-19 నుంచి ఒకటో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించి క్రమంగా విస్తరించాలని అందులో ఆదేశించాం. సమాంతరంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం టీచర్ల నియామకం జరిపాం. 2018 జూన్‌ నుంచి ప్రాథమిక పాఠశాలల్లో తెలుగుకు సమాంతరంగా ఇంగ్లి్‌షలో బోధన మొదలు పెట్టాం’ అని à°’à°• మాజీ మంత్రి వివరించారు. సక్సెస్‌ స్కూళ్లను పూర్తిస్థాయి ఆంగ్ల మీడియం స్కూళ్లుగా మారుస్తూ 2015లోనే జీవో ఇచ్చామని మరో నేత చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆంగ్ల మీడియం ప్రవేశపెడుతూ 2015లో ఉత్తర్వులు జారీ చేశామని.. 300కిపైగా à°ˆ విద్యాలయాల్లో దాని అమలు కూడా మొదలైందని ఆయన తెలిపారు.