నో స్కూల్‌ బ్యాగ్‌ డే...అంతా వట్టిదే!

Published: Monday December 09, 2019
ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు మోయలేనంతగా పుస్తకాల బ్యాగ్‌ను తీసుకువెళ్ళాల్సి వస్తున్నది. చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 1 నుంచి 5 తరగతుల వరకు ప్రతి నెల మొదటి, మూడవ శనివారాల్లో నో బ్యాగ్‌డే అమలుచేయాలని ప్రభుత్వం జూలైలో ఆదేశాలు జారీచేసింది. దీనిని కచ్ఛితంగా అమలుచేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఉన్నతాశయంతో ప్రవేశ పెట్టిన నో బ్యాగ్‌డే విధానాన్ని అధికారులు అభాసుపాలు చేస్తున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితమవుతున్న చిన్నారుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన à°ˆ కార్యక్రమం జిల్లాలో అమలుచేయక పోవటం విమర్శలకు దారితీస్తున్నది.
 
నో బ్యాగ్‌ డే పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. à°’à°•à°Ÿà°¿ నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు à°ˆ విధానాన్ని అమలు చేయాల్సివుంది. నీతికథల బోధన, నైతికవిలువలు, సేవా కార్యక్రమాలు, చిత్ర లేఖనం తదితర అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియ జేయాల్సివుంది. క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవటం, చెప్పటం, అనుభవాలను పంచుకోవటం, పొడుపు కథలు, పజిల్స్‌, సరదా ఆటలు ఆడించాల్సి ఉంది. అలాగే సాగుకు సంబంధించి కూడా బోధన చేయాల్సి ఉంది. వీటన్నింటినీ 1, 3 శనివారాల్లో కచ్ఛితంగా అమలుచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవేవీ అమలు కాక పోతుండటంతో చిన్నారులకు బ్యాగ్‌à°² మోతబరువు తప్పటం లేదు.
 
ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్ని పాఠశాలల్లో నో బ్యాగ్‌డే అమలుచేయాలని మండలస్థాయి విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నో బ్యాగ్‌ డేను అమలు చేయడంలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ స్కూల్స్‌లో నో బ్యాగ్‌ డే అమలుపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం à°ˆ నెలలో రానున్న మూడో శనివారంలోనైనా పాఠశాలల్లో à°’à°•à°Ÿà°¿ నుంచి 5 తరగతుల విద్యార్థులకు నో స్కూల్‌ బ్యాగ్‌ డే అమలై పుస్తకాల బరువు మోత తగ్గుతుందో లేదోచూడాలి. కాగా డీవైఈవో à°Ž.కిరణ్‌ను వివరణ కోరగా కచ్చితంగా స్కూల్స్‌లో నో స్కూల్‌ బ్యాగ్‌డే అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.