కిలో ఉల్లి కోసం రైతుబజార్ల వద్ద నాలుగైదు గంటలసేపు పడిగాపులు

Published: Tuesday December 10, 2019
ఉల్లి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో రద్దీ కొనసాగుతోంది. సామాన్యులకు కన్నీళ్లతోపాటు కాళ్ల నొప్పులూ తప్పడం లేదు. కిలో ఉల్లి కోసం రైతుబజార్ల వద్ద నాలుగైదు గంటలసేపు పడిగాపులు తప్పడంలేదు. కొన్నిచోట్ల అర్ధరాత్రే రైతు బజార్లకు చేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కిలోమీటర్ల మేర బారులు కనిపిస్తున్నాయి. అయినా అదనపు కౌంటర్లు పెంచకపోవడంతో జనానికి తిప్పలు తప్పడంలేదు. తాజాగా.. కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం ఉల్లి కోసం క్యూలో నిల్చొన్న ఓ వృద్ధుని గుండె ఆగింది. పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని సొంత ఇలాకానే ఈ ఘటన జరగడం గమనార్హం. ఒకేసారి వేలాది మంది చొచ్చుకురావడతో గుడివాడ రైతుబజారు వద్ద క్యూలో నిల్చున్న నూనె సాంబిరెడ్డి(65) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
 
 
à°ˆ పరిణామంతో విశాఖలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైతు బజారులో ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుంచి విక్రయాలు ప్రారంభిస్తుండగా, వినియోగదారులు అర్ధరాత్రి నుంచే అక్కడ బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. గుడివాడ ఘటనతో విశాఖలో అదనపు కౌంటర్లు పెంచారు. కర్నూలు ఉల్లి అయిపోయిందని, కృష్ణాపురం ఉల్లిని ఒక్కక్కరికీ కిలో రూ.50 చొప్పున విక్రయించారు. à°† ఉల్లికి కూడా ప్రజలు పోటెత్తారు. కాగా, ఉల్లి సమస్య తీరేంత వరకు రైతుబ జార్లకు వారానికి ఇచ్చే à°’à°• రోజు సెలవు కూడా రద్దు చేస్తున్నామని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రకటించారు. నెల్లూరు బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.200 దాటింది. పెద్ద సైజు 220కిపైగా పలుకుతోంది. ఫత్తేఖాన్‌పేట రైతుబజారులో ఉల్లి పంపిణీ నిలిపివేయడంతో ప్రజలు తిరగబడ్డారు. కావలి రైతు బజారు వద్ద జరిగిన తోపులాటలో కొత్తపల్లి హరిజనవాడకు చెందిన తోట నాగుభూషణం సొమ్మసిల్లి పడిపోయాడు. ఒంగోలులో రైతు బజార్ల వద్ద సోమవారం వేకువజామున 4 à°—à°‚à°Ÿà°² నుంచే చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి. కాగా, ‘పేదలపై సీఎం జగన్‌కు à°…à°‚à°¤ కక్ష ఎందుకో అర్థం కావడం లేదు. ఉల్లికోసం సామాన్యులు అల్లాడుతున్నారు. జగన్‌ అసమర్ద పాలన కారణంగా క్యూలైన్లలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుడివాడ రైతు బజార్లో కేజీ ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిలబడి సాంబయ్య మృతిచెందిన ఘటన తీవ్రంగా కలిచివేసింది’ అని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.